Curry Leaves Benefits: ప్రతి భారతీయ వంటకంలో కరివేపాకునుం వినియోగిస్తారు. ముఖ్యంగా దక్షణ భారతదేశంలో వంటకాల రుచిని పెంచేందు ఈ ఆకు సహాయపడుతుంది. దీని తినడం వల్ల శరీరానికి కావాల్సి అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా బరువును కూడా నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కావున బరువును నియంత్రించుకోవాలనుకునే వారు.. తప్పకుండా వీటితో తయారు చేసిన ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కరివేపాకును ఆరోగ్య నిధి శాస్త్రం పేర్కొంది:
కరివేపాకులో భాస్వరం, కాల్షియం, ఇనుము, రాగి, విటమిన్లు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా వినియోగపడుతాయి. ప్రతిరోజూ ఉదయం 3 నుంచి 4 పచ్చి ఆకులను నమిలి తింటే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
కరివేపాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
1. కళ్లను మెరుగుపరుచుతుంది:
రోజూ ఉదయం కరివేపాకు ఆకులను తినడం వల్ల..శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపర్చుతుంది. రేచికటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది చాలా ఉపయోపడుతుంది.
2. డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది:
కరివేపాకులోని గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఇందులో హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉన్నందున మధుమేహంతో బాధపడుతున్న వారికి ఎంతో సహాయపడుతుంది.
3. జీర్ణక్రియ మెరుగుపరుచుతుంది:
కరివేపాకును ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తుంది.
4. వ్యాధుల సంక్రమణను నివారిస్తుంది:
కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. కావున అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా వ్యాధులను నివారిస్తుంది. కావున ప్రతి రోజు క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాలి.
5. బరువును నియంత్రిస్తుంది:
ప్రతి రోజూ ఉదయం పూట కరివేపాకు ఆకులను తినడం వల్ల బరువును నియంత్రించి, పొట్ట చుట్టు కొవ్వును తగ్గిస్తుంది. ఎందుకంటే ఇందులో ఇథైల్ అసిటేట్, మహానింబైన్, డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు ఉంటాయి. కావున శరీర బరువును నియంత్రిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:Shyja Moustache: మీసమున్న మహిళ.. 'చురకత్తి' లాంటి ఆ మీసాలు లేకుండా జీవితాన్నే ఊహించుకోలేదట..
Also read:Mohanbabu: చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ అందుకే.. అసలు విషయం చెప్పేశారు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook