Weight loss Tips: స్థూలకాయం ప్రస్తుతం సర్వత్రా కన్పించే ప్రధాన సమస్య, అందుకే బరువు తగ్గే క్రమంలో ప్రతి ఒక్కరూ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మీరు చేసే కొన్ని పొరపాట్లు మూల్యం చెల్లించుకునేలా చేస్తాయి. ఆ వివరాల మీ కోసం..
ఆధునిక జీవనశైలిలో ఎదురౌతున్న ముఖ్యమైన సమస్యల్లో ఒకటి స్థూలకాయం. బరువు పెరిగిపోవడం. చాలా రకాల ఎక్సర్సైజ్లు చేస్తూ బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చాలా సందర్భాల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గరు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం కాక సతమతమౌతుంటారు. కానీ ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం మన జీవనశైలిలోని కొన్ని అలవాట్లే. బరువు తగ్గించుకునే క్రమంలో మనం చేసే కొన్ని పొరపాట్ల కారణంగా ఫలితం ఎప్పుడూ దక్కదు. ఆ పొరపాట్లు, తప్పులు ఏంటో చూద్దాం..
భోజనం చేస్తున్నప్పుడు ఏం చేయకూడదు NEVER DO THESE MISTAKES WHILE EATING
సాధారణంగా ఎక్కువమంది చేసే తప్పు ఇదే. ప్రతిరోజూ చేసే పొరపాటు. టీవీ చూస్తూనో లేదా మొబైల్ చూస్తూనో భోజనం చేయడం అన్నింటికంటే పెద్ద పొరపాటు. ఇలా చేయడం వల్ల మీకు తెలియకుండానే ఎక్కువ తినేస్తారు. ఫలితంగా బరువుపై ప్రభావం పడుతుంది. అందుకే భోజనం చేసేటప్పుడు మీ దృష్టి పూర్తిగా దానిపైనే ఉండాలి. టీవీలు చూడటం, మొబైల్ చూడటం వంటివి చేయకూడదు. భోజనం చేసేటప్పుడు గంటలకొద్దీ ఫోన్ కూడా మాట్లాడకూడదు.
భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ తొందర ఉండకూడదు. నిదానంగా తినడం అలవాటు చేసుకోవాలి. అంటే తినే ప్రతి ముద్ద నమిలి తినడం మంచిది. ఎందుకంటే మీ కడుపు నిండిందా లేదా అనేది మీ మెదడు గుర్తించేందుకు కాస్త సమయం పడుతుంది. తొందరపాటులో వేగంగా తింటే మీకు తెలియకుండా ఎక్కువ తినే ప్రమాదముంది. ఫలితంగా బరువుపై ప్రభావం పడుతుంది.
సరైన నిద్ర Adequate Sleep
మీకు కావల్సినంత లేదా మంచి నిద్ర లేకపోతే లిప్టిన్ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా ఆకలి ఎక్కువై..తిండి ఎక్కువ తింటుంటారు. ఎందుకంటే మీ ఆకలిని నియంత్రించేది ఈ హార్మోనే. ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఏ సమస్యా ఉండదు. నిద్ర సరిగ్గా ఉంటే లిప్టిన్ హార్మోన్ స్థాయి బాగుంటుంది. భోజనం తినేటప్పుడు ఒకరితో మాట్లాడటం గానీ లేదా ఫోన్ చూడటం వంటివి చేయకూడదు. తినే తిండిపైనే దృష్టి పెట్టాలి. నిద్ర సరిగ్గా ఉండటం వల్ల బాడీ మెటబోలిజం మెరుగవుతుంది. హార్మోన్ విడుదల సక్రమంగా ఉంటుంది. ఇదంతా కచ్చితంగా బరువుపై ప్రభావం చూపిస్తుంది.
Also read: Red Sandal Benefits: పింపుల్స్ నుంచి ఉపశమనం, అందం రెట్టింపు..ఎర్రచందనాన్ని ఇలా రాస్తే చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.