Weight loss tips: స్థూలకాయం ప్రస్తుత రోజుల్లో అందర్నీ వేధించే ప్రధాన సమస్యగా మారింది. స్థూలకాయమనేది బాహ్యంగా కన్పించేదే కాదు..ఆరోగ్యపరంగా అనేక సమస్యలకు కారణమౌతుంది. అందుకే ఎప్పటికప్పుడు సరైన చిట్కాల ద్వారా తగ్గించుకునే మార్గాల్ని అణ్వేషించాలి.
శరీరం బరువు పెరగడమనేది తేలిగ్గా తీసుకునే అంశం కానేకాదు. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన ఇలా రకరకాల కారణాలు ప్రభావితం చూపిస్తుంటాయి. బరువు పెరిగే కొద్దీ వివిధ వ్యాధుల ముప్పు అధికమౌతుంది. స్థూలకాయం కారణంగా డయాబెటిస్, థైరాయిడ్, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ఆలస్యంగా అర్ధరాత్రి భోజనం చేయడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం వంటి కారణాల వల్ల శరీరం బరువు పెరిగిపోతుంటుంది. స్థూలకాయానికి వయస్సుతో సంబంధం లేదు. అన్ని వయస్సులవారిని వెంటాడుతుంది. ఈ నేపధ్యంలో కొన్ని చిట్కాల ద్వారా ఏ వయస్సువారైనా బరువు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..
Circadian Rhythm Fasting
అంటే ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకూ భోజనం చేయడం ఉంటుంది. అంటే మీరు పగటి పూట 12 గంటలు తిని..మిగిలిన 12 గంటలు ఏం తినకుండా ఉండాలి. ఉదయం లేని బ్రేక్‌ఫాస్ట్, మద్యాహ్నం భోజనం, రాత్రి 7 గంటల్లోగా డిన్నర్ పూర్తి చేసుకుని..రాత్రంతా ఇక ఏం తినకూడదు. నీళ్లు మాత్రం తాగవచ్చు. నీళ్లు తప్ప మరేవీ ముట్టకూడదు. బరువు తగ్గించుకునేందుకు ఇదొక అద్భుతమైన ఉపాయం. చాలామంది వైద్యులు ఈ విధానాన్ని సిఫారసు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానం పూర్తిగా విస్తృతంలో రాలేదు. కానీ మంచి ఫలితాలు తప్పకుండా ఉంటాయి.
Body Hydrate
రోజుకు అవసరమైనంత నీళ్లు తాగడం వల్ల క్రేవింగ్స్ ఎఫెక్ట్ తగ్గుతుంది. మీ కడుపు నిండినట్టుగా అనుభూతి ఉంటుంది. శరీరాన్ని డీటాక్సిఫై చేసేందుకు కూడా ఎక్కువ నీళ్లు తాగడమనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తక్కువ నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. హార్మోన్ బ్యాలెన్స్ ఉండదు. ఫలితంగా బరువు పెరుగుతుంది. వేగంగా బరువు తగ్గాలంటే గోరు వెచ్చని నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. కేవలం బరువు తగ్గించుకునేందుకే కాకుండా..మెరుగైన ఆరోగ్యం, జీవక్రియకు కూడా ప్రతిరోజూ 8-9 గ్లాసుల నీళ్లు తాగడం చాల ా మంచిది.
Better Sleep
నిద్ర శరీరానికి చాలా అవసరం. బాహ్యంగా, అంతర్గతంగా నిద్ర కీలకమైంది. సరైన నిద్ర ఉంటే..శరీరంలో కొవ్వు కూడా కరుగుతుంది. రాత్రి 10 గంటలకు నిద్రపోవడం వల్ల లివర్ డీటాక్స్ అవుతుంది. అదే విధంగా రాత్రి 10 గంటల్నించి 2 గంటల వరకూ ఉండే సమయంలో బరువు వేగంగా తగ్గుతుంది. అందుకే డిన్నర్ త్వరగా ముగించుకుని త్వరగా అంటే 10 గంటల్లోగా పడుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి. ఉదయం పూట 12 గంటలు ఆహారం మానేసినా ఇదే ఫలితముంటుంది కానీ..రోజువారీ పనులకు ఇబ్బంది ఏర్పడే అవకాశాలుంటాయి. అందుకే రాత్రి సమయంలో 12 గంటలు పూర్తిగా ఆహారానికి దూరంగా ఉంటే కచ్చితంగా బరువు తగ్గుతారు.
Also read: Toothache Remedies: పంటి నొప్పులు భరించలేకపోతున్నారా..ఈ 4 చిట్కాలు పాటిస్తే చాలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.