Weight Loss Tips: ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా కన్పించే సమస్య స్థూలకాయం. స్థూలకాయమనేది ఎన్నో రుగ్మతలకు కారణమౌతుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ బరువు తగ్గేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. మరి కేవలం ఒకే నెలలో బరువు తగ్గాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం..
సాధ్యమైనంత తక్కువ సమయంలో బరువు తగ్గించుకోవాలనేది అందరి ఆలోచన. ఇందులో భాగంగా చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. కడుపు, నడుము చుట్టూ అనవసరమైన కొవ్వు పేరుకుపోతుంటుంది. దీనికోసం రోజూ తీసుకునే ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ మార్చుకోవడమే మంచి మార్గం. అప్పుడే మంచి ఫలితాలుంటాయి. బరువు తగ్గేందుకు రోజూ ఏయే ఆహార పదార్ధాలు తీసుకోవాలి, ఎలాంటి మార్పులు చేసుకోవాలనే విషయంపై ఆరోగ్య నిపుణుల సూచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
బ్రేక్‌ఫాస్ట్‌లో హెల్తీ డైట్
బరువు తగ్గించుకునే ప్రక్రియ ఎప్పుడూ బ్రేక్‌ఫాస్ట్ నుంచి ప్రారంభం కావాలి. ఎందుకంటే మనం తినే బ్రేక్‌ఫాస్ట్‌ని బట్టే రోజంతా ఆధారపడి ఉంటుంది. ఉదయం వేళల్లో కూరలు, పరోఠాలు, ఆయిలీ ఫుడ్స్ తినే అలవాటుంటే వెంటనే మార్చుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ స్థానంలో తాజా పండ్లు లేదా ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇలా చేస్తే కొవ్వు తగ్గడమే కాకుండా కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రభావం చూడవచ్చు.
గ్రీన్ టీ సేవనం, ఫ్రూట్ షేక్ నిషిద్ధం
పండ్లు తినడం లేదా పండ్ల జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటివల్ల కచ్చితంగా బరువు తగ్గే అవకాశాలుంటాయి. కానీ పండ్ల షేక్ అనేది మంచిది కాదు. ఫ్రూట్ షేక్స్‌తో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎందుకంటే పండ్లు, పాల ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. కడుపులో ఇబ్బంది ఏర్పడి..జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. ఇక రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ తాగే టీ, కాఫీల స్థానంలో గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. గ్రీన్ టీ వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు కరగడమే కాకుండా..వేగంగా బరువు తగ్గుతారు.
స్వీట్స్‌కు దూరం
సాధారణంగా స్వీట్స్, ఐస్‌క్రీమ్స్ అందరూ ఇష్టపడతారు. కానీ ఆరోగ్యపరంగా చూస్తే ఈ రెండూ మంచివి కావు. పంచదారతో చేసే పదార్ధాలు తినడం వల్ల కచ్చితంగా బరువు పెరుగుతారు. అందుకే ఈ రెండు అలవాట్లకు దూరంగా ఉండాలి. స్వీట్స్ ఒకవేళ తీసుకున్న పరిమితి దాటకూడదు.
Also read: Mosquito Repellent: తరుచుగా మీకు దోమలు కుడుతున్నాయా.. అయితే ఈ చిట్కా పాటించండి..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.