భారతీయ చలనచిత్ర పితామహుడు 'దాదాసాహెబ్ ఫాల్కే'

భారతీయ సినిమా పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన దాదాసాహెబ్ ఫాల్కే జయంతి నేడు.

Last Updated : May 2, 2018, 03:16 PM IST
భారతీయ చలనచిత్ర పితామహుడు 'దాదాసాహెబ్ ఫాల్కే'

భారతీయ సినిమా పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన దాదాసాహెబ్ ఫాల్కే జయంతి నేడు. ఆయన 148వ జయంతిని పురస్కరించుకొని గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది. ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయితగా ప్రసిద్ధి చెందిన దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఈయన కృషి, జిజ్ఞాసల ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలన చిత్రరంగం తొలి అడుగులు వేసింది. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, మాజిక్, మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరిన దాదా సాహెబ్ ఫాల్కేను ఆయన జయంతి సందర్భంగా సగర్వంగా స్మరించుకుంటోంది జీన్యూస్ తెలుగు.

 

ముఖ్య ఘట్టాలు:

* ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే మహారాష్ట్ర సమీప త్రయంబకేశ్వర్‌లో 1870 ఏప్రిల్ 30న జన్మించారు.

* 1913లో తొలిసారి 'రాజా హరిశ్చంద్ర' సినిమా తీశారు. ఇప్పుడిది భారతదేశ మొట్టమొదటి పూర్తి నిడివిగల చిత్రంగా ప్రసిద్ధికెక్కింది.

* దాదాసాహెబ్ ఫాల్కే తన 19 ఏళ్ల సినీ జీవితంలో 95 చిత్రాలను, 26 లఘు చిత్రాలను రూపొందించారు.

* 1969లో భారత ప్రభుత్వం ఈయన భారత సినిమాకు అందించిన సహాయ సహకారాల గౌరవార్థం 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు'ను ప్రారంభించింది.

ఈ అవార్డును భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ఇచ్చే అత్యంత గౌరవప్రదమైన పురస్కారాలలో ఒకటిగా పేర్కొంటారు

* 1971లో భారత తపాలా శాఖ దాదాసాహెబ్ ఫాల్కే ముఖచిత్రం కలిగి ఉన్న తపాలాబిళ్లను విడుదల చేశారు.

* 2001లో ముంబాయిలోని దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ ఒక గౌరవ పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. ఈ అవార్డును భారతీయ సినిమాలో జీవితకాలం కృషి చేసినవారికి ఇస్తారు.

మే 3, 1913 తేదిన విడుదల అయిన రాజా హరిశ్చంద్ర మూవీ ఫుటేజ్ ని చూడండి...

Trending News