Sachin Tendulkar solve Virat Kohli's problem feels Ajay Jadeja టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గత మూడేళ్లుగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడలేదన్న విషయం తెలిసిందే. అలవోకగా హాఫ్ సెంచరీ, సెంచరీలు చేసే కోహ్లీ.. ఇటీవలో కాలంలో సింగల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. 2019 నవంబర్ మాసంలో సెంచరీ చేసిన కోహ్లీ.. ఇప్పటివరకు ఒక్క సెంచరీ బాధలేదు. మూడు ఫార్మాట్లలో ఆడపాదడపా ఇన్నింగ్స్‌లు ఆడుతున్న కోహ్లీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇటీవలి అతడి ఫామ్‌పై చర్చ కొనసాగుతూనే ఉంది.
ప్రస్తుతం ఇంగ్లండ్ గడ్డపై ఉన్న విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20, వన్డేలలో ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. ఈ పర్యటన అనంతరం వెస్టిండీస్‌కు భారత్ వెళ్లనుంది. ఈ పర్యటనలో కోహ్లీకి చోటు దక్కలేదు. విశ్రాంతినిచ్చే ఉద్దేశంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ అతడిని పక్కకు పెట్టింది. టీ20 ప్రపంచకప్ 2022 నాటికి మానసికంగా సిద్ధమయ్యేందుకు కొన్ని రోజుల పాటు విరామం తీసుకోవాలని పలువురు మాజీలు సూచించారు. ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ ఫామ్ లేమిపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జోక్యం చేసుకోవాలని మరోసారి సూచించారు.
సోనీ సిక్స్‌లో అజయ్ జడేజా మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ ఫామ్ లేమిపై ఇటీవలి కాలంలో చర్చ జరుగుతూనే ఉంది.ఈ విషయం 8 నెలల క్రితమే చెప్పా, మరోసారి చెబుతున్నా.. కోహ్లీ విషయంలో సచిన్ టెండూల్కర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సచిన్ మాత్రమే కోహ్లీ సమస్య ఏంటో తెలుసుకోగలడు. అందుకే కోహ్లీ, సచిన్ కలిసి విందు ఆరగించాలని సూచించా. కెరీర్‌ను 14- 15 ఏళ్లకే ప్రారంభించిన సచిన్.. ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూశాడు. అందుకే ఇతరుల గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. సచిన్ మాత్రమే సరైన వ్యక్తి అని భావిస్తున్నా' అని అన్నారు.
'విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ కలవడానికి కేవలం ఒక్క ఫోన్ కాల్ చాలు. ఆ కాల్ కోహ్లీ చేయకపోయినా.. సచిన్ తప్పకుండా చేయాలి. యువ క్రీడాకారులు ఫామ్ కోల్పోవడం సహజమే. ప్రతి ఆటగాడికి సంధి దశ ఉంటుంది. దాన్ని అనుభవించక తప్పదు. మనం పెద్దవాళ్లం, ఇలాంటి దశను దాటుకుని వచ్చాము కాబట్టి యువకులతో చర్చించాల్సిన బాధ్యత ఉంటుంది. మాస్టర్ బ్లాస్టర్ కోహ్లీకి కాల్ చేస్తాడని ఆశిస్తున్నాను' అని అజయ్ జడేజా పేర్కొన్నారు.
Also Read: PV Sindhu Final: సింగపూర్ ఓపెన్ 2022 ఫైనల్‌కు పీవీ సింధు.. తొలి టైటిల్‌పై కన్ను!
Also Read: Oppo A97 5G Price: రూ.23 వేలకే ఒప్పో కొత్త 5జీ ఫోన్.. సూపర్ స్పెసిఫికేషన్లు ఇవే!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.