Tamilisai Soundararajan: కాకతీయ చరిత్రను తెలుసుకునేందుకు గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ నల్గొండ జిల్లాలో పర్యటించారు. నకిరేకల్ మండలం చందుపట్లలో కాకతీయ వీర వనిత రాణి రుద్రమదేవి మరణ రహస్య శిలాశాసనం కాంస్య విగ్రహం వద్ద ఆమెకు నివాళులర్పించారు.
Tamilisai Soundararajan: కాకతీయ చరిత్రను తెలుసుకునేందుకు గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ నల్గొండ జిల్లాలో పర్యటించారు. నకిరేకల్ మండలం చందుపట్లలో కాకతీయ వీర వనిత రాణి రుద్రమదేవి మరణ రహస్య శిలాశాసనం కాంస్య విగ్రహం వద్ద ఆమెకు నివాళులర్పించారు. అనంతరం శిలాశాసనాన్ని సందర్శించారు. రుద్రమదేవి పోరాట చరిత్రను తెలుసుకున్నారు. చరిత్రకు సజీవ సాక్షంగా నిలిచిన శిలాశాసనంపై లిఖి౦చబడ్డ వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్రీస్తు శతకం 1289 లో శత్రువులపై దండయాత్రలో భాగంగా...రాణి రుద్రమదేవి వీర మరణం పొందినట్టు చరిత్రచెబుతోంది. ఆమెతో పాటు సైనికాధికారి మల్లికార్జున నాయుడు కూడా శత్రువుల దాడిలో బలైనట్టు ఆనవాళ్లు కనిపించాయి.