ఈ నెల 27న తేదిన "కణం" చిత్రం రిలీజవుతుంది. నాగశౌర్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాకి ఇప్పటికే భారీ స్థాయిలో క్రేజ్ క్రియేట్ అయి ఉంది. అల్టిమేట్ ఇమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గురించి, మీడియాతో చాల విషయాలు షేర్ చేసుకుంది సాయి పల్లవి. అవి మీకోసం
సినిమా గురించి
‘కణం’ లాంటి సినిమా చేయాలనే ఆలోచన నాకు లేనే లేదు. గతంలో కూడా హారర్ స్టోరీస్ విని ఉన్నాను. వాళ్ళతో డైరెక్ట్‌గా నో అని చెప్పకపోయినా, ఇంకో 2, 3 సినిమాల తరవాత చేద్దాము అని చెప్పి అవాయిడ్ చేశాను. కానీ ‘కణం’ విషయంలో నో చెప్పి కూడా సెట్స్ పైకి వచ్చాను
అమ్మ వల్లే
నేను నో అని చెప్పాక డైరెక్టర్ స్టోరీ పంపించారు. నేను చదవలేదు కానీ అమ్మ చదివి, ఇలాంటి స్టోరీని ఎలా వదులుకుంటున్నావ్ అని అడిగింది. అప్పుడు చదివాను కంప్లీట్ స్టోరీ… చాలా నచ్చేసింది ఇమ్మీడియట్ గా యస్ చెప్పాను
నో చెప్పడానికి రీజన్
మన అందరి లైఫ్ లో న్యాచురల్ గానే లవ్ ఉంటుంది కాబట్టి లవర్ గా యాక్ట్ చేయొచ్చు, కూతురుగా నటించవచ్చు కానీ, ఒక తల్లిగా నటించడం అనేది కష్టం. ఎందుకంటే ప్రాక్టికల్ గా నాకలాంటి ఎక్స్ పీరియన్స్ లేదు కాబట్టి, చేయగలనా అనిపించేది
ఆ రేంజ్‌లో కనెక్ట్ అయిపోయాను
ఈ సినిమా చేసే వెరోనికా తో నిజంగానే ఒక తల్లిలా కనెక్ట్ అయిపోయాను. షూటింగ్ జరిగినన్ని రోజులు పాప పడుకునేటప్పుడు కూడా నేనే చూసుకునే దాన్ని, షూటింగ్ అయిపోయాక కూడా వెరోనికా మదర్ కి కాల్ చేసి, పాప గురించి అడిగి తెలుసుకునేదాన్ని. తను నిజంగా నా పాపే అనేంతలా కనెక్ట్ అయిపోయాను
అసలలాంటి ఫీలింగ్ లేదు
ఈ స్టేజ్ ఆఫ్ కరియర్ లో తల్లిగా నటించానా అనే ఫీలింగ్ లేదు. ఇలాంటి రోల్స్ చేయకూడదు అనే బారియర్ అయితే నేనెప్పుడూ పెట్టుకోలేదు. బిగినింగ్ లో నో అని చెప్పడానికి నేను చేయలేనేమో అనే అనుమానం అంతే.. ఎప్పుడైతే చేయగలిగానో చాలా హ్యాప్పీ… క్యారెక్టర్స్ చేయడానికి ఏజ్ తో, ఇమేజ్ తో సంబంధం లేదు.ఎలా పర్ఫాం చేశామన్నదే ఇంపార్టెంట్
మొటిమలు నా స్టైల్ స్టేట్ మెంట్ కాదు
‘ప్రేమమ్’ కి ముందు నేను జార్జియాలో ఉన్నప్పుడు నా ఫేస్ పై మొటిమలు పోగొట్టుకోవడానికి చాలా చేసేదాన్ని, దుపట్టా తో ఫేస్ దాచుకునేదాన్ని, ఇంటర్నెట్ లో చూసి రెమెడీస్ ట్రై చేసేదాన్ని.. కానీ ఏం చేసినా అవి పోలేదు. ప్రేమమ్ చేసేటప్పుడు మొటిమల గురించి భయపడ్డా.. కానీ ఎప్పుడైతే అందరూ నన్ను నాలా ఆక్సెప్ట్ చేశారో.. దాంతో నాకే కాదు అందరు అమ్మాయిలకు మంచి మెసేజ్ రీచ్ అయింది
ఏ రోల్ అయినా సేమ్ ఫీలింగ్
ప్రేమమ్ లో నా క్యారెక్టర్ చూసుకున్నా, ‘ఫిదా’ లో అయినా చేసే ఏ క్యారెక్టర్ అయినా కొత్తే.. ఫస్ట్ మైండ్ లో స్ట్రైక్ అయ్యే క్వశ్చన్ ‘చేయగలనా..?’ , కణం సినిమాకి కూడా అంతే.. అన్ని క్యారెక్టర్స్ లాగే ఇది కూడా.. పెద్ద తేడా ఏమీ లేదు
ప్రతి పేరెంట్ కనెక్ట్ అవుతారు
‘కణం’ సినిమాకి ప్రతి పేరెంట్ కనెక్ట్ అవుతారు అందులో అనుమానం లేదు. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి.
దటీజ్ నాగశౌర్య
ఈ సినిమా చేసేటప్పుడు నాగశౌర్య నుండి చాలా నేర్చుకున్నాను. కొన్ని సీక్వెన్సెస్ లో నాగశౌర్య ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఇంటికి వెళ్ళాక ట్రై చేసేదాన్ని. అంత గొప్ప నటుడు నాగశౌర్య. తన యాక్టింగ్ స్టామినా ఎలివేట్ అయ్యే రేంజ్ లో సినిమా అవకాశాలు తనకు రావాలి.
ఏదైనా ఒకటే చేస్తా
ప్రస్తుతం సినిమాలు చేస్తున్నాను కాబట్టి కంప్లీట్ గా సినిమాల గురించే ఆలోచిస్తున్నాను. ఒకవేళ డాక్టర్ గా నా కరియర్ బిగిన్ చేయాలని అనుకున్న రోజు సినిమాలు చేయను.. ఏదైనా ఒకదానిపైనే ఫోకస్ చేస్తా.. రెండింటిపై కాదు
(జీ సినిమాలు సౌజన్యంతో)