Vastu tips for home: ఇంటి అలంకరణలో కృత్రిమ పువ్వులు వాడకండి, కారణం ఇదే

Vastu tips for home: ప్రజలు తమ ఇంటి అలంకరణలో ఎక్కువగా కృత్రిమ పువ్వులను వాడుతుంటారు. ఇవి ఇంట్లో ఉంచడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల కలిగే నష్టాలు ఏంటో చూద్దాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2022, 07:26 PM IST
  • ఇంట్లో పొరపాటున కూడా నకిలీ పూలను ఉంచవద్దు
  • పొడి పువ్వులను ఉంచడం కూడా హానికరం
  • అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి
Vastu tips for home:  ఇంటి అలంకరణలో కృత్రిమ పువ్వులు వాడకండి, కారణం ఇదే

Vastu tips for home: చాలా మంది తమ ఇళ్లను అలంకరించేందుకు ఎక్కువగా కృత్రిమ పువ్వులను వాడతారు. ఇంట్లో నకిలీ పువ్వులను ఉంచడం వల్ల ఇది నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. దీని వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడవచ్చు. అనేక రకాల వ్యాధులు చుట్టుముడతాయి. ఇంట్లో కృత్రిమ పుష్పాలను (artificial flowers) ఉంచడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం. 

నకిలీ పూలతో కలిగే నష్టాలు
>> ఫెంగ్ షుయ్ ప్రకారం, ఇంట్లో కృత్రిమ పువ్వులు ఉంచడం అశుభంగా భావిస్తారు. ఎందుకంటే ఇది ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ తీసుకువస్తుందని నమ్ముతారు. 
>> ఇంట్లో నకిలీ పువ్వులు ఉంచినట్లయితే... మీ ఆనందం కూడా నకిలీగానే మిగిలిపోతుంది.  ఇంట్లోని వ్యక్తుల మధ్య విభేదాలు పెరగవచ్చు.
>> ఇంట్లో ఆర్టీపిషయల్ పూలు పెట్టడం వల్ల మీరు ఇతరుల్లో తప్పులు వెతికే అలవాటును పెంచుతుంది. 
>> కృత్రిమ పూలతో పాటు పొడి పూలను కూడా ఇంట్లో ఉంచకూడదు. అవి చాలా అశుభమైనవిగా భావిస్తారు.  ఇవి ఇంట్లో నుండి ఆనందం దూరమయ్యేలా చేస్తాయి. 
>> నకిలీ పువ్వులు ఇంట్లోని మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.  అంతేకాకుండా మహిళల్లో ఒత్తిడి, తలనొప్పి మొదలైన సమస్యలను కూడా కలిగిస్తాయి.

Also Read: Bhadli Navami 2022: భడ్లీ నవమి ఎప్పుడు? దీని ప్రాధాన్యత ఏంటి? 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 

Android Link https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News