Mercury transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏ గ్రహ స్థానచలనమైనా మిగిలిన అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. జూలై 2 నుంచి బుధ గ్రహం మిధునరాశిలో ప్రవేశించనున్న సందర్బంగా ఏయే రాశులకు లాభాలు కలగనున్నాయో పరిశిలిద్దాం..
ప్రతి నెలా ఏదో ఒక గ్రహం గోచారం లేదా వక్రమార్గం ఉంటుంది. దీని ప్రభావం 12 రాశులపై స్పష్టంగా ఉంటుంది. జూలై 2వ తేదీ నుంచి బుధు గ్రహం రాశి పరివర్తనం జరగనుంది. మిధున రాశిలో బుధుడు ప్రవేశించనున్నాడు. బుధుడి ఈ రాశి పరివర్తనం వల్ల కొన్ని రాశులపై అంతా శుభమే జరుగుతుంది. అటు కొన్ని రాశులకు మాత్రం చాలా సమస్యలు ఎదురౌతాయి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడి గోచారం జూలై 2, 2022 ఉదయం 9 గంటల 40 నిమిషాలకు ఉంటుంది. మిధున రాశి గురువు బుధగ్రహం. ఇదే రాశిలో గోచారం జరగనుంది. ఈ తరుణంలో బుధుడు గోచారం చాలా మహత్వపూర్వకంగా ఉండనుంది. బుధుడి గోచారం ఈ రాశులకు అత్యంత శుభప్రదం కానుంది.
కన్యరాశి వారికి ఈ గోచారం కారణంగా కెరీర్లో స్థిరత్వం లభించవచ్చు. ఈ రాశి జాతకులకు కష్టపడినదానికి పూర్తి ప్రయోజనాలుంటాయి. వ్యవసాయం చేసేవారికి కొత్త పనులు చేసే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా నిర్ణయం తీసుకునే తెలివితేటలు పెరుగుతాయి. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలరు.
మకరరాశి వారు ఈ సమయంలో కష్టపడితే చాలా ప్రయోజనాలుంటాయి. విజయాలు లభిస్తాయి ఈ నేపధ్యంలో పదోన్నతి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. సౌభాగ్యం లభిస్తుంది. పనిచేసే చోట ప్రశంస లభిస్తుంది. కెరీర్లో పెద్దోళ్లతో పొగడ్తలు లభిస్తాయి. మకరరాశి జాతకులకు ధనలాభం బాగా ఉంటుంది. బుధుడి గోచారం కారణంగా ఫలప్రదంగా ఉంటుంది. డబ్బులు భారీగా వచ్చి పడతాయి.
సింహరాశి జాతకులకు ధనలాభముంటుంది. అంతేకాదు..తమ కోర్కెలు నెరవేర్చుకుంటారు. గోచారం సందర్భంగా వ్యక్తి కెరీర్లో అభివృద్ధి ఉంటుంది. దానికి సంబంధించి కొత్త అవకాశాలు లభిస్తాయి. అటు నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం పెరుగుతుంది. బుధుడి గోచారం కారణంగా సింహరాశివారికి అంతులేని ధన సంపాదన ఉంటుంది. ధన సంపాదనకు కొత్త మార్గాలు తెర్చుకుంటాయి.
Also read: IT Returns 2022: ఐటీ రిటర్న్స్ చేసేటప్పుడు గుర్తుంచుకోవల్సిన విషయాలు, చివరి తేదీ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook