Benefits Of Eating Sprouts: ప్రస్తుతం చాలా మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే ఈ సమస్య బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మార్కెట్ లభించే వివిధ రకాల జంక్ ఫుడ్ తినడం వల్ల బ్లాడ్‌లో షుగర్ లెవల్స్ పెరిగి వ్యాధి మరింత తీవ్ర రూపం దాల్చుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడుతున్న వారు మొలకల ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటి వల్ల జీవక్రియ మెరుగుపడి.. రక్తంలో చక్కెరను వేగంగా తగ్గిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ మొలకలను తినాలి:
మొలకెత్తిన పెసర పప్పు:
మొలకెత్తిన పెసర పప్పు వల్ల చాలా రకాల ప్రయోజనాల ఉంటాయని తెలుసు. అయితే మధుమేహం వ్యాధితో బాధపడుతున్న వారు వీటిని తింటే ఎన్ని రకాల ప్రయోజనాలుంటాయో తెలుసా..? విటెక్సిన్, ఐసోవిటెక్సిన్ అనే కొన్ని యాంటీఆక్సిడెంట్లు మూంగ్‌లో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ మొలకెత్తిన మూన్‌లో ఫైబర్, ప్రోటీన్ పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది.
మొలకెత్తిన సోయాబీన్స్:
మొలకెత్తిన సోయాబీన్ చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వీటి రుచి చాలా హీనంగా ఉంటుంది. కానీ ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. సోయాబీన్‌లో ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, ఫైటోఈస్ట్రోజెన్‌లు ఉంటాయి. కావున ఇవి పొట్టకు, శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వీరు తప్పకుండా ఆహారంలో తీసుకోవాలి.
మొలకెత్తిన శనగ:
మొలకెత్తిన శనగ గురించి అందరికీ తెలిసిందే. దీన్ని దాదాపు ప్రతి ఇంట్లో సలాడ్‌గా లేదా బెల్లంతో తింటారు. అయితే డయాబెటిక్ పేషెంట్లు వీటిని క్రమం తప్పకుండా తింటే శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Benefits of Jamun Fruit: వేసవిలో నేరేడు తింటే స్పెర్మ్ కౌంట్ అమాంతం పెరుగుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.