Bandla Ganesh: ర్యాంపులు.. వ్యాంపులు వస్తుంటాయి, పోతుంటాయంటూ పూరీకి కొత్త తలనొప్పులు

 Bandla Ganesh Sensational Comments :  ఆకాష్ పూరి హీరోగా  తెరకెక్కిన ‘చోర్ బజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, ఎన్నో ర్యాంప్ లు.. వ్యాంప్ లు వస్తుంటాయి… పోతుంటాయి,  పూరి సక్సెస్ అయ్యాక చాలా మంది స్టార్లు వచ్చారు అంటూ బండ్ల చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 23, 2022, 08:38 AM IST
  • చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా బండ్ల గణేష్
  • పూరిని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు
  • ర్యాంపులు.. వ్యాంపులు అంటూ పరోక్ష సెటైర్లు
Bandla Ganesh: ర్యాంపులు.. వ్యాంపులు వస్తుంటాయి, పోతుంటాయంటూ పూరీకి కొత్త తలనొప్పులు

Bandla Ganesh Sensational Comments : పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో ‘చోర్ బజార్’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. జూన్ 24న విడుదల కాబోతోన్న ఈ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ కు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టాడు.  మైక్ పట్టుకుంటే ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళుతూ ఉంటుంది. తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా బండ్ల ఏదో చెప్పాలని ప్రయత్నించి ఇంకేదో చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచాడు. 

తాను దూరంగా ఉంటే మా వదిన, పూరి భార్య లావణ్య ఫోన్ చేసింది ఫంక్షన్ కి రావాలని కోరిందని ఆవిడ కోసమే  ఈ ఫంక్షన్ కి వచ్చానని చెప్పుకొచ్చాడు మా వదిన అంటే నాకు ఎంతో ఇష్టమన్న ఆయన ఒక అమ్మ ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా, ఒక అక్క ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా, ఒక భార్య ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా అంటూ ఆమె మీద ప్రశంసల వర్షం కురిపించారు. సీతా దేవిని నేను చూడలేదు కానీ సీతా దేవికి ఉన్నంత ఓపిక ఉంది ఆవిడకి అంటూ తన తల్లిని ఎంత గౌరవిస్తానో.. ఆవిడని కూడా అంత గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. 

ఎన్నో ర్యాంప్ లు.. వ్యాంప్ లు వస్తుంటాయి… పోతుంటాయి. కానీ అమ్మ శాశ్వతం. జీవితాంతం ఆవిడని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ఆకాష్ ది, పవిత్రది, పూరి అన్నది.. అంటూ కామెంట్స్ చేశాడు. పూరి గారు పెద్ద డైరెక్టర్ అవుతాడు… భూమి బద్దలు కొడతాడు.. ఇండస్ట్రీని దొబ్బేస్తాడు..అని పెళ్లి చేసుకోలేదు ఆవిడ, ఆయన జేబులో రెండు వందలు ఉన్నాయి అని చెప్పినా వచ్చి సనత్ నగర్ గుడిలో పెళ్లి చేసుకుంది, పూరి సక్సెస్ అయ్యాక చాలా మంది స్టార్లు వచ్చారు. కానీ ముందుగా వచ్చింది ఆమెనే అంటూ జరుగుతున్న ప్రచారానికి ఊతం ఇచ్చే విధంగా కామెంట్స్ చేశాడు. 

దేశమంతా కళ్ళాపు జల్లాడు కానీ ఇంటి ముందు కళ్ళాపు జల్లడానికి టైం లేదు ఆయనకి అంటూనే వరెవరినో స్టార్లని చేసావ్.. డ్యాన్స్ లు రాని వాళ్లతో డ్యాన్స్ లు చేయించావ్, డైలాగులు చెప్పడం రాని వాళ్ళతో డైలాగులు చెప్పించావ్ కానీ నీ కొడుకు సినిమాకి వచ్చేసరికి ఎక్కడికో వెళ్లి కూర్చున్నావు అంటూ కామెంట్స్ చేశాడు. అయితే ఎన్నో ర్యాంప్ లు.. వ్యాంప్ లు వస్తుంటాయి… పోతుంటాయి,  పూరి సక్సెస్ అయ్యాక చాలా మంది స్టార్లు వచ్చారు అనే డైలాగులు ఛార్మిని ఉద్దేశించి బండ్ల గణేష్ అన్నాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయం మీద ఆకాష్ పూరి మాట్లాడుతూ అలాంటిది ఏమీ లేదన్నట్టు కొద్దిరోజుల క్రితమే కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:Salman Khan, Chiranjeevi, Venkatesh: చిరంజీవి, వెంకటేష్‌లతో సల్మాన్ ఖాన్ పార్టీ.. హోస్ట్ ఎవరో తెలుసా ?

Also Read: Ante Sundaraniki on Netflix: నెలలోపే ఓటీటీలోకి 'అంటే సుంద‌రానికి'.. ఏ రోజు విడుదలవుతుందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News