సినీ సౌందర్య మననుంచి భౌతికంగా దూరమై నేటికి 14ఏళ్లు. ఆమె చనిపోయి 14 ఏళ్లు పూర్తైనా.. సౌందర్య మన స్మృతిపథంలోంచి వెళ్లిపోలేందంటే కారణం, అందం... అభినయం...ఆహార్యం! పదహారణాల తెలుగమ్మాయిలా అనిపించే సౌందర్య, అమితాబ్ బచ్చన్‌తో 'సూర్యవంశం' చిత్రంలో నటించిన సౌందర్య రఘు, తన కెరీర్లో అనేక చిత్రాలలో నటించారు. జూలై 18, 1972న జన్మించిన ఆమె, 31 సంవత్సరాల వయసులో లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో నటి సౌందర్య మరణించారు.
సౌందర్య ఫిలిం రైటర్, నిర్మాత, పారిశ్రామికవేత్త అయిన కేఎస్ సత్యనారాయణ కుమార్తె. సౌందర్య ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు, తన తండ్రి స్నేహితుడొకరు తన సినిమాలో నటించాలని ఆఫర్ చేయగా.. ఆమె అంగీకరించింది. చదువును మధ్యలోనే ఆపేసింది. ఆతరువాత ఆమె ప్రఖ్యాత నటిగా మారింది.
సౌందర్య కెరీర్ లో ఎన్నో చిత్రాల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించారు.
తెలుగు సినీపరిశ్రమలో అత్యంత ప్రభాశాలురైన నటీమణులలో సౌందర్య ఒకరు. వెంకటేష్-సౌందర్య తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపబడ్డారు. సౌందర్య అందుకున్న అవార్డులు: నేషనల్ ఫిలిం అవార్డు-1, కర్నాటక స్టేట్ ఫిలిం అవార్డులు-2, సౌత్ ఫిలిం ఫేర్ అవార్డులు-5, నంది అవార్డులు-3
సౌందర్య చిన్ననాటి మిత్రుడు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రఘుని 2003లో వివాహం చేసుకుంది. 2004లో బీజీపీ పార్టీలో చేరారు. అదే ఏడాది ఏప్రిల్ 17న బెంగళూరు నుండి విమానాశ్రయం ప్రస్తుత తెలంగాణలోని అప్పటి కరీంనగర్లో పార్లమెంట్ అభ్యర్థి (బీజేపీ) చెన్నమనేని విద్యాసాగర్‌రావు తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరానాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే కుప్పకూలిపోవడంతో సజీవ దహనమయ్యారు. (ఫొటోలన్నీ యూట్యూబ్ నుండి తీసుకోబడ్డాయి)
Next Gallery