Benefits Of Watermelon: ఎండకాలంలో చాలా మంది శరీరాన్ని హైడ్రెట్‌గా ఉంచుకోవడానికి వివిధ రకాల పానీయాలు తాగుతారు. సమ్మర్ వీటిని ఆస్వాదించడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా వేసవిలో పండ్ల ప్రియులకు చాలా రకాల ప్రూట్స్ లభిస్తాయి. ముఖ్యంగా నీటి శాతం అధికంగా ఉన్న పుచ్చకాయ లాంటి పండ్లు మార్కెట్‌లో అధికంగా విక్రయిస్తున్నారు. అయితే దీనిని నుంచి తీసిన జ్యూస్ రెస్టారెంట్లలో నిత్యం చూస్తూ ఉంటారు. దీనిని ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లో తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం..
వేసవిలో పుచ్చకాయ, దోసకాయ, వంటి పండ్లను అధికంగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. వేసవిలో, కోల్డ్ కాఫీ, లస్సీ, మాంగోషేక్ వంటి పానీయాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఇవి కాకుండా పుచ్చకాయ నుంచి జ్యూస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ జ్యూస్ కోసం కావాల్సిన పదార్థాలు:
- పుచ్చకాయ ముక్కలు 5 కప్పులు
- 3 స్పూన్ నిమ్మరసం
- 2 చిటికెడు నల్ల మిరియాలు
- అర అంగుళం అల్లం ముక్క
- 10 పుదీనా ఆకులు
ముందుగా పుచ్చకాయను బాగా కడగాలి. ఆ తర్వాత రెండు లేద మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. మధ్యలో నుంచి కట్ చేసి.. వీలైతే, దాని విత్తనాలన్నింటినీ తొలగించండి. తర్వాత గ్రైండ్ చేసుకొని.. మళ్లీ పంచదార వేసి బ్లెండ్ చేయాలి. ఇప్పుడు అందులో నిమ్మరసం వేసి సర్వ్ చేసకుకోవాలి. అంతేకాకుండా సర్వ్ చేసుకునే క్రమంలో ఐస్ క్యూబ్స్ వేసుకోండి. దీనిపైన పుదీనా ఆకులతో అలంకరించండి. అంతే రెస్టారెంట్ స్టైల్ పుచ్చకాయ జ్యూస్ రెడీ అవుతుంది.
Also Read: Urad Dal Side Effects: అతిగా మినపప్పు తింటున్నారా..అయితే ప్రమాదమే..!!
Also Read: Tamarind Benefits For Hair: చింతపండు రసం వల్ల జుట్టుకు ఎన్ని లాభాలున్నాయో తెలుసా..!!
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.