కామన్వెల్త్ క్రీడల్లో భారత షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ సత్తా చాటాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ మూడు పొజిషన్ల పోటీలో పాల్గొన్న ఆయనకు కామన్వెల్త్లో ఇదే తొలి బంగారు పతకం. 2006లో మెల్బోర్న్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో కూడా కాంస్యం గెలుచుకున్న సంజీవ్.. ఈసారి స్వర్ణం గెలవడం విశేషం. మొత్తంగా చూసుకుంటే.. తాజా వార్తల ప్రకారం.. భారత షూటర్లు ఇప్పటికి ఈ కామన్వెల్త్లో 8 బంగారు పతకాలు గెలుచుకున్నారు.
37 ఏళ్ల రాజ్‌పుత్ ఫైనల్ రౌండ్లో 454.5 పాయింట్లు నమోదు చేసి విజయం సాధించాడు. అంతకు ముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో కూడా 1180 పాయింట్లతో ఆయన టాప్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. బెల్మోంట్ షూటింగ్ సెంటర్ వేదికగా జరిగిన ఇదే పోటీలో మరో భారత్ షూటర్ చైన్ సింగ్
కేవలం అయిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు
ఇదే పోటీల్లో సంజీవ్ రాజ్‌పుత్ తర్వాతి స్థానాల్లో గ్రెగార్జ్ సిక్ (కెనడా) ఫైనల్లో 448.4 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచి రజతం గెలుచుకోగా.. డీన్ బేల్ (ఇంగ్లాండ్) 441.2 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకున్న రాజ్‌పుత్ 2014 గ్లాస్కో గేమ్స్‌లో కూడా రజతం గెలుచుకున్నాడు.
#SanjeevRajput shoots another gold 🥇for India in men's 50m Rifle 3 Position event.
India! gear up for more medals.
Our players are on fire @GC2018 .
Let's cheer for them.🎇#GC2018#RangDeTiranga 🇮🇳 pic.twitter.com/Gu91eHRcg6— Dept of Sports MYAS (@IndiaSports) April 14, 2018