World No Tobacco Day 2022: ప్రస్తుతం చాలా మంది పొగాకు వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. పొగ తాగే వారికే కాకుండా వారి చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేస్తోంది. దీంతో వారు కూడా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే చాలా మందికి పొగాకు వల్ల వచ్చే ప్రమాదల అవగాహనలేక పోవడం వల్లే వ్యాధుల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంస్థ పేర్కొంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా అవగహన కల్పిండమే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినమని WHO తెలిపింది. ఈ రోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం. కావున పొగాకు వల్ల వచ్చే వ్యాధులను తెలుసుకుందాం.
ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని మొదట 1987 మే 31న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఈ దినం జరుపుకుంటారు. పొగాకు వల్ల కలిగే వ్యాధుల గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పిస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ (WHO) కొన్ని విషయాలను పంచుకుంది. 80 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్(Carbon dioxide CO2) ప్రతి సంవత్సరం పర్యావరణంలోకి ప్రవేశిస్తోంది. దీంతో వాతావరణ కాలుష్యంగా మారి విషపూరితంగా మారుతోంది. అయితే సిగరెట్ నుంచి వచ్చే పొగ మానవ శరీరాన్ని నాశనం చేయడమే కాకుండా పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తోంది. కావున ఈ ధూమపానానికి బై-బై చెప్పి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని WHO తెలిపింది.
పొగాకు నుంచి దూరంగా ఉండడానికి ఇంటి చిట్కాలు:
అల్లం టీతో :
మీరు ధూమపానం విముక్తి పొందడానికి చాలా రకాల ఇంటి చిట్కాలున్నాయి. అందులో ముఖ్యమైనది అల్లం టీ. ఒక్కసారిగా సిగరెట్ల మానేయడం మంచిది కాదు. దీని వల్ల వికారం లేదా తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. అయితే అల్లం టీ తీసుకుంటే ధూమపానం నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
ద్రాక్షపండు రసం తాగడం:
బీడీ-సిగరెట్ తాగినప్పుడు శరీరంలో నికోటిన్ ప్రవేశిస్తుంది. ఇలా క్రమం తప్పకుండా తాగితే ఊపిరితిత్తులు, గొంతు వంటి సమస్యలు పెరుగుతాయి. శరీరంలో నికోటిన్ తొలగిపోవాలంటే ద్రాక్షపండు రసం త్రాగాలి. ఈ జ్యూస్‌లో ఉండే అసిడిక్ కంటెంట్ శరీరం నుంచి నికోటిన్‌ను తొలగించడానికి సహాయపడుతుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Benefits of Moringa Leaves: మునగ ఆకు వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నయో తెలుసా..?
Also Read: saffron benefits for men: శారీరక బలహీనతతో బాధపడుతున్నారా..ఇవి నానబెట్టుకుని తాగండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook