EPF Nomination Process: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన సభ్యులను నామినీలను EPF ఖాతాలకు లింక్ చేయాలని కోరింది. EPF ఖాతాలలో నామినీని చేర్చకపోతే ఖాతాదారు EPFO అందించే అనేక ప్రయోజనాలను పొందలేరని సదరు ఆర్గనైజేషన్ పేర్కొంది. ఖాతాదారుడు EPFO అధికారిక సైట్లో నామినీల పేర్లు, వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. EPF / PF నామినేషన్లను మార్చడం గురించిన వివరాలను EPFO ట్వీట్ చేసింది.
నామినేషన్లో మార్పులు చేయాలనుకునే వారు ఈపీఎఫ్ పోర్టల్‌లో ప్రొఫైల్ ఫోటోను అప్డేట్ చేయడం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. మీరు ప్రొఫైల్ ఫోటో లేకుండా నామినేషన్‌ను అప్డేట్ చేస్తే.. 'ఈ ప్రక్రియను పూర్తి చేయలేము, దయచేసి మీ ఫోటోను అప్లోడ్ చేయండి' అనే సందేశం మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీరు ఫోటోను సరిగ్గా అప్లోడ్ చేసిన తర్వాత మీరు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఆన్ లైన్ కొత్త EPF నామినేషన్ దాఖలు చేయండిలా..
1) UAN EPFO సైట్‌కి లాగిన్ అవ్వాలి.
2) ఆ తర్వాత ఇ-నామినేషన్‌పై క్లిక్ చేయాలి.
3) మీకు కుటుంబం ఉంటే.. ఫ్యామిలీ డిక్లరేషన్ 'అవును' పై క్లిక్ చేయండి.
4) కుటుంబ వివరాలను జోడించడం ఆధారంగా మీ నామినీ వివరాలను నమోదు చేయండి.
5) నామినీ రిఫరెన్స్ నంబర్, పుట్టిన తేదీ, లింగం, సంబంధం, చిరునామా, ఛాయాచిత్రం, బ్యాంక్ వివరాలను అందులో చేర్చాలి.
6) మీరు నామినీలుగా ఎంచుకుంటున్న వారి వివరాలను వరుసగా జోడించండి.
7) మీ కుటుంబ సభ్యుల్లో వరుసగా వారివారి వాటాలను డిక్లర్ చేయండి. పీఎఫ్ 100 శాతం లోని భాగాలను విభజించి.. వాటిని ఆయా కుటుంబసభ్యులకు డిక్లర్ చేయండి.
8) సేవ్ EPF నామినేషన్ పై క్లిక్ చేయడం ద్వారా మీ వివరాలు సేవ్ అవుతాయి.
9) OTPని పొందడానికి ఇ-సైన్ను క్లిక్ చేయండి. ఆ పీఎఫ్ అకౌంట్ కు జోడించిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని సమర్పించండి. దీంతో మీ పీఎఫ్ నామినేషన్ పూర్తవుతుంది.
Also Read: Realme Smart TV Flipkart: రూ.2,249 ధరకే రియల్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని కొనేయండి!
Also Read: Petrol-Diesel Price: దేశవ్యాప్తంగా స్థిరంగా ఇంధన ధరలు...పెట్రోల్-డీజిల్ ధరలు ఏ నగరంలో ఎంత?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook