Shani Jayanti 2022: జ్యోతిషశాస్త్రం (Astrology) ప్రకారం శని దేవుడిని న్యాయ దేవతగా కూడా పిలుస్తారు. శని దేవుడు కొంత మందికి మంచి ఫలితాలు ఇస్తే... మరికొంత మందిని ఇబ్బందులకు గురిచేస్తాడు. శనిదేవుడు జ్యేష్ఠ మాసంలోని అమావాస్య తిథి నాడు జన్మించాడు. ఈసారి మే 30న శని జయంతిని (Shani Jayanti 2022) జరుపుకోనున్నారు. శని దేవుడి ఆశీస్సులు పొందడానికి మరియు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆ రోజున శని దేవుడిని పూజించి.. శుభ సమయంలో దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ సారి శని జయంతి రోజునే సోమవతి అమావాస్య, వట్ సావిత్రి వ్రతం కూడా వచ్చాయి. శని జయంతిరోజు శుభ ముహూర్తాన్ని తెలుసుకుందాం రండి.
ఈ ముహూర్తంలో పూజించి దానం చేయండి
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈసారి శని జయంతి మే 29వ తేదీ మధ్యాహ్నం 2:54 గంటలకు ప్రారంభమై మే 30వ తేదీ సాయంత్రం 4:59 గంటల వరకు కొనసాగుతుంది. ఈసారి శని జయంతి నాడు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుందని, ఈ యోగంలోనే శని ఆరాధన జరగనుంది. కావున ఈసారి శని జయంతి నాడు సర్వార్థ సిద్ధి యోగంలో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 30వ తేదీ ఉదయం 7.12 గంటలకు సర్వార్థ సిద్ధి యోగం ప్రారంభమై మే 31వ తేదీ మంగళవారం ఉదయం 5.24 వరకు ఉంటుంది. పూజా ఫలాలు మీకు పూర్తిగా లభించాలంటే ఈ ముహూర్తంలో పూజలు, దానధర్మాలు చేయడం మంచిది.
శనిదేవుని ఆలయాన్ని సందర్శించండి
శని ఆలయంలో శని దేవుడిని దర్శించి, ఆవాల నూనె, నల్ల నువ్వులు సమర్పించాలని నమ్ముతారు. ఈ రోజున శనికి సంబంధించిన వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం. నల్ల గొడుగు, నల్లని బూట్లు, నల్లని వస్త్రాలు, నల్ల నువ్వులు, ఆవనూనె మొదలైన వాటిని దానం చేయడం మీరు అనుకున్నది సిద్ధిస్తుంది.
Also Read: Shani Jayanti 2022: శని జయంతి రోజున ఈ పనులు చేస్తే.. మీ లైఫ్ బిందాస్ గా ఉంటుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.