Green Chillies Benefits: పచ్చిమిర్చితో కలిగే ఆ ఐదు ప్రయోజనాలు తెలిస్తే..ఇక వదిలిపెట్టరు

Green Chillies Benefits: పచ్చిమిర్చితో కేవలం రుచి ఒక్కటే కాదు..ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పచ్చిమిర్చితో కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోతారు. గ్రీన్ చిల్లీతో కలిగే ఆ ఐదు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 22, 2022, 09:18 AM IST
  • పచ్చిమిర్చితో కేవలం రుచి ఒక్కటే కాదు..ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా
  • బరువు తగ్గేందుకు పచ్చిమిర్చి ఎలా దోహదం చేస్తుంది
  • బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్, మూడ్ ఛేంజర్‌గా పచ్చిమిర్చీలు
Green Chillies Benefits: పచ్చిమిర్చితో కలిగే ఆ ఐదు ప్రయోజనాలు తెలిస్తే..ఇక వదిలిపెట్టరు

Green Chillies Benefits: పచ్చిమిర్చితో కేవలం రుచి ఒక్కటే కాదు..ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పచ్చిమిర్చితో కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోతారు. గ్రీన్ చిల్లీతో కలిగే ఆ ఐదు ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

ప్రతి భారతీయుని కిచెన్‌లో తప్పకుండా ఉంటుంది పచ్చిమిర్చి లేదా గ్రీన్ చిల్లీ. భారతీయలకు సహజంగానే స్పైసీ ఫుడ్ ఇష్టం. అందుకే గ్రీన్ చిల్లీ లేకుండా ఫుడ్ ఐటమ్స్ అనేవి ఉండవు. ఆఖరికి బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా చిల్లీ తగలాల్సిందే. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇతర ఆహార పదార్ధాలతో పచ్చిమిర్చిని పచ్చిగానే తింటుంటారు. పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైకిన్ అనే రసాయనం స్పైసీగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన లాభాలు కూడా చేకూరుస్తుంది. తాజాగా ఉండే గ్రీన్ చిల్లీస్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అటు ఎండు మిరపకాయల్లో మాత్రం విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. మిర్చిలోని బ్రైట్ కలర్..బీటో కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ బి, విటమిన్ ఇ, ఐరన్, పొటాషియంలు అధికంగా ఉన్నాయని సూచిస్తుంది. అసలు గ్రీన్ చిల్లీస్‌తో కలిగే ఐదు ముఖ్యమైన ప్రయోజనాలంటే పరిశీలిద్దాం..

పచ్చిమిర్చితో కలిగే ఐదు ఆరోగ్యకర ప్రయోజనాలు

చర్మ సంరక్షణ

గ్రీన్ చిల్లీస్‌లో పుష్కలంగా లభించే విటమిన్ సి కారణంగా చర్మం ఎక్కువ మొత్తంలో కొలాజెన్ విడుదల చేస్తుంది. మీ అందానికి మెరుగులు దిద్దడంలో విటమిన్ సి అనేది చాలా కీలకం. మీ చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్రీన్ చిల్లీలో ఉండే విటమిన్ ఇ కారణంగా ఏజీయింగ్ సమస్యను అదుపులో ఉండి..యవ్వనంగా కన్పిస్తారు.

బరువు తగ్గేందుకు

పచ్చిమిర్చిలో అసలు కేలరీలే ఉండవు. అందుకే ఇది బరువు తగ్గించుకోవాలనుకునేవారికి ఉపయోగకరం.  రోజూ మీ ఆహారంలో గ్రీన్ చిల్లీ భాగంగా చేసుకుంటే..బాడీ మెటబాలిజం అనేది 50 శాతం పెరుగుతుంది. ఇది వెయిట్ లాస్‌కు కారణమౌతుంది. 

మూడ్ ఛేంజర్

గ్రీన్ చిల్లీస్‌లో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ఇది యాంటీ డిప్రెంజెంట్‌లా పనిచేస్తుంది. ఇందులో ఉండే క్యాప్సైకిన్ రసాయనం ఇందుకు దోహదపడుతుంది. ఈ రసాయనం మెదడులోని ఫీల్‌గుడ్ హార్మోన్ ఎండోర్ఫిన్ స్థాయిని పెంచుతుంది. అందుకే విభిన్నమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు మీ డైట్‌లో గ్రీన్ చిల్లీస్ భాగంగా చేసుకోండి. 

గుండెకు రక్షణ

గ్రీన్ చిల్లీస్ అనేవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఎథెరో స్క్లెరోసిస్ ముప్పు తగ్గుతుంది. మీ శరీరంలో ఇని హిబిటరీ ప్రభావాన్ని పెంచడంతో..బ్లడ్‌క్లాట్ ముప్పు తగ్గడమే కాకుండా గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. 

నొప్పి నుంచి ఉపసంహరణ

గ్రీన్ చిల్లీస్‌లో అద్భుతమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఫలితంగా శరీరంలోని పెయిన్ లెవెల్స్ తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్, ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధులున్నవారిలో ఇన్‌ఫ్లమేటరీ సమస్యల్ని దూరం చేస్తాయి. 

Also read: Radish side effects: ముల్లంగిని తినడం మంచిదేనా..? మీరు దీనిని క్రమం తప్పకుండా తింటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోండి..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News