IPL 2022 Do or Die Match: గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ డూ ఆర్ డై మ్యాచ్ నేడే

IPL 2022 Do or Die Match: ఐపీఎల్ 2022లో ప్లే ఆఫ్ రేసుకు అమీ తుమీ తేల్చుకునే మ్యాచ్. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఇవాళ జరగనుంది. నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్ ఇది ఆర్సీబీకు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 19, 2022, 12:31 PM IST
  • గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ డూ ఆర్ డై మ్యాచ్ నేడే
  • ముంబై వాంఖడే స్టేడియంలో సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్
  • ప్లే ఆఫ్ చేరాలంటే ఆర్సీబీకు గెలవక తప్పని మ్యాచ్ ఇది
 IPL 2022 Do or Die Match: గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ డూ ఆర్ డై మ్యాచ్ నేడే

IPL 2022 Do or Die Match: ఐపీఎల్ 2022లో ప్లే ఆఫ్ రేసుకు అమీ తుమీ తేల్చుకునే మ్యాచ్. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఇవాళ జరగనుంది. నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్ ఇది ఆర్సీబీకు.

ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ కీలకమైన మ్యాచ్ ఇవాళ సాయంత్రం వాంఖడే వేదికగా జరగనుంది. గుజరాత్ టైటాన్స్‌కు ఓ సాధారణ మ్యాచ్ ఇది. కానీ ఆర్సీబీకు మాత్రం గెలవక తప్పని మ్యాచ్. ప్లే ఆఫ్ బరిలో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్. అందుకే ఆర్సీబీకు ఇది డూ ఆర్ డై మ్యాచ్.

ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లు ఆడి 7 మ్యాచ్‌లలో విజయంతో 14 పాయింట్లు సాధించి..ఐదవ స్థానంలో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరాలంటే ఇవాళ జరిగే మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించాలి. అటు మే 21న ఢిల్లీ కేపిటల్స్ జట్టు..ముంబై చేతిలో ఓడిపోవల్సి ఉంటుంది.  అంటే ఇవాళ జరిగే మ్యాచ్‌లో విజయమే కాకుండా..ఇతరుల జయాపజయాలు కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాల్ని నిర్ధారించనున్నాయి.

సాధ్యాసాధ్యాలు..

వాస్తవానికి ఆర్సీబీ బలమైన జట్టే. విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ వంటి బ్యాటర్లతో పాటు మొహమ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, హసరంగ, హర్షల్ పటేల్ వంటి బౌలర్లు కూడా ఉన్నారు. విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్‌లు రాణిస్తే ఇక ఏ జట్టు కూడా ఆర్సీబీని ఆపలేదు. అంతటి పటిష్టమైన బ్యాటర్లు వీళ్లు. కానీ ఒకేసారి అందరూ ఫామ్‌లో ఉండటం లేదు.  ప్రధాన బౌలర్లు సిరాజ్, హేజిల్‌వుడ్‌లు ఫామ్‌లో లేకపోవడం మరో బలహీనతగా ఉంది.

ఇక గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే జట్టు పెద్ద బలంగా లేకపోయినా సమిష్టిగా రాణిస్తోంది. వరుస విజయాలతో ఆత్మస్థైర్యం కావల్సినంత ఉంది. శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా ఫామ్‌లో ఉండటం జట్టుకు బలం. గుజరాత్ టైటాన్స్‌కు ఇది సీరియస్ మ్యాచ్ కాదు కాబట్టి..సీనియర్లకు రెస్ట్ ఇచ్చి..రిజర్వ్ ఆటగాళ్లతో ఆడించే అవకాశాలున్నాయి. 

ఏదేమైనా ఆర్సీబీకు మాత్రం ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ జట్టుపై భారీ విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు కొనసాగుతాయి. లేదంటే నిష్క్రమించాల్సిందే.

Also read: KKR vs LSG: ఎవిన్ లూయిస్ అత్యద్భుతమైన క్యాచ్, కేకేఆర్ ఓటమికి కారణం అదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News