New Job Suggestions: కొత్త కంపెనీకి వెళ్తున్నారా .. అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే..!

New Job Suggestions: ప్రతి ఉద్యోగి కంపెనీ మారుతున్న సమయంలో పడే టెన్షన్‌ అంతా ఇంతా కాదు.. ఎందుకంటే ఇన్నేళ్లూ పనిచేసిన సంస్థను వీడి కొత్తగా మరో కంపెనీకి వెళ్తే అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో కూడా తెలియదు. మీరు కొత్తగా చేరే కంపెనీలో ఈ ఐదు జాగ్రత్తలు పాటిస్తే చాలు.. అది కూడా మీ పాత ఆఫీసే అయిపోతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 02:42 PM IST
  • కంపెనీ మారుతున్న ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన విషయాలు
  • తోటి ఉద్యోగులతో సఖ్యతగామెదగాలి
  • ఇతరులపై అనవసరపు కామెంట్లు చేయొద్దు
New Job Suggestions: కొత్త కంపెనీకి వెళ్తున్నారా .. అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే..!

New Job Suggestions: ప్రతి ఉద్యోగి తన భవిష్యత్‌ కోసమే కంపెనీలు మారుతుంటాడు. ఈ క్రమంలో పాత కంపెనీతో ఉన్న అనుబంధం, అక్కడి ఉద్యోగులతో ఏర్పడిన స్నేహం మర్చిపోవడం కాస్త ఇబ్బందే. అయినప్పటికీ భవిష్యత్‌ బంగారుమయం కావాలంటే, మరింత ఉన్నతస్థితికి చేరుకోవాలంటే కొత్త కొత్త కంపెనీలకు వెళ్లాల్సిందే. అయితే అలా కంపెనీలు మారుతున్న తరుణంలో కొత్త వాతావరణం ఎలా ఉంటుందోననే టెన్షన్‌ విపరీతంగా ఉంటుంది. అక్కడి ఉద్యోగులు ఎలా సహకరిస్తారో కూడా తెలియదు. ఈ క్రమంలో ఈ ఐదు చిట్కాలు పాటించి వారికి మరింత దగ్గరకావొచ్చు. తక్కువ సమయంలోనే వారితో మిత్రుత్వం పెంచుకోవచ్చు.

కొత్త ఉద్యోగానికి వెళ్తున్న ఎంప్లాయి ముఖ్యంగా ఈ ఐదు అంశాలను గుర్తుంచుకోవాలి. అందులో కంపెనీ గురించి తెలుసుకోవడం,  మన పని మనం చేసుకుంటూ వెళ్లడం, మన ప్రవర్తన విధానం, కొంతమేర వ్యక్తిగత వివరాలు షేర్‌ చేసుకోవడం, అవసరమైనప్పుడు తోటి ఉద్యోగుల సాయం కోరడం. ఇలా ఈ ఐదు అంశాలను దృష్టిలో ఉంచుకుంటే చాలు.. మీ కొత్త ఆఫీస్‌ కూడా మీకు ఎంతో పాతది అన్న ఫీలింగ్‌ వస్తది.

ముఖ్యంగా పరిసరాల గురించి తెలుసుకోవడం.. అంటే మీరు కొత్తగా జాయిన్‌ కాబోయే కంపెనీలో మీతో కలిసి గతంలో పనిచేసిన ఉద్యోగి ఉంటే అక్కడి వాతావరణం గురించి ఎంక్వైరీ చేసుకోవాలి. అతని నుంచి సలహాలు సూచనలు తీసుకోవాలి. అంతేకాదు కంపెనీ డీటెయిల్స్‌ కూడా పూర్తిగా తెలుసుకుంటే ఇంకా బెటర్‌. ఇక మన పని మనం చేసుకోవడం.. అంటే ఎలాంటి టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా పని చేసుకోవాలి. తోటి ఉద్యోగులతో కలిసి సరదాగా ఉండాలి. అప్పుడే మైండ్‌ లో ఎలాంటి ఆలోచనలు లేకుండా సాఫీగా మీ పని మీరు చేసుకోగలగుతారు.

మన ప్రవర్తన.. కొత్త ఆఫీస్‌లో మీ ప్రవర్తన ఎంటన్నది చాలా ముఖ్యం. మన నడవడిక బాగుంటేనే పదిమంది మనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతారు. ఇతరులతో నవ్వుతు ఉండటం వల్ల ఆఫీస్‌లో మంచి వాతావరణం ఏర్పడుతుంది. తోటి ఉద్యోగులతో నమ్మదగిన విషయాలు మాత్రమే షేర్‌ చేసుకోవాలి.  ఇష్టాలు, హాబీస్‌ తెలుసుకోవాలి. అప్పుడే ఉద్యోగుల మధ్య మరింత  మంచి బాండింగ్‌ ఏర్పడుతుంది. అదే సమయంలో ఇతరుల గురించి అనసవర కామెంట్లు చేయకపోవడం ఉత్తమం. అవసరమైన సందర్భంలో తోటి ఉద్యోగుల సాయం తీసుకోవాలి. ఇలా ఈ ఐదు అంశాలపై దృష్టిపెడితే కొత్త కంపెనీలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేసుకుంటారు.

Also Read: Ambati Rayudu Retirement: అంబటి రాయుడు షాకింగ్ నిర్ణయం.. ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ పోస్ట్!

Also Read: Chandrababu Naidu: కుప్పం పర్యటనలో జూ.ఎన్టీఆర్ అభిమానిపై ఫైర్ అయిన చంద్రబాబు నాయుడు..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News