Guidelines for Schools amid Heatwave: భయపెడుతున్న ఎండలు...పాఠశాలలకు కేంద్రం మార్గదర్శకాలు

Guidelines for Schools amid Heatwave: ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ భానుడి ప్రతాపానికి పెద్దలే తట్టుకోలేకపోతున్నారు. మరి పిల్లల పరిస్థితి ఏంటి ? పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ? ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తాజాగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 11, 2022, 09:59 PM IST
  • మండిపోతున్న ఎండలు
  • పాఠశాలలకు కేంద్రం మార్గదర్శకాలు
  • జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన కేంద్రం
Guidelines for Schools amid Heatwave: భయపెడుతున్న ఎండలు...పాఠశాలలకు కేంద్రం మార్గదర్శకాలు

Guidelines for Schools amid Heatwave: ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ భానుడి ప్రతాపానికి పెద్దలే తట్టుకోలేకపోతున్నారు. మరి పిల్లల పరిస్థితి ఏంటి ? పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ? ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం తాజాగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.

స్కూల్ టైమింగ్స్‌లో మార్పులు

పాఠశాలల సమయాల్లో మార్పులు చేసుకోవాలని సూచించింది. ఉదయం 7 గంటలకే బడులు తెరిచి త్వరగా మూసివేయాలి

పని గంటలు తగ్గించుకోవాలి.

రవాణా

స్కూల్ బస్సులు, వ్యాన్‌లలో కిక్కిరిసి పిల్లలను తరలించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ప్రయాణ సమయంలో బస్సు లేదా వ్యాన్‌లలో ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో పాటు తాగు నీరు ఉండేలా చూడాలని ఆదేశించింది.

నడక, సైకిల్ పై వచ్చే విద్యార్థులు ఎండ నుంచి కాపాడుకునేలా తలను కప్పుకుని రావాలని సూచించింది.

నీడ ఉన్న ప్రాంతంలో స్కూల్ బస్సు పార్క్‌ చేయాలి

తాగు నీటి వసతి

విద్యార్థులు వాటర్ బాటిళ్లు, గొడుగులు, టోపీలు తెచ్చుకోవాలని సూచించింది.

కూలర్లు, మట్టి కుండలు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.

బ్రేక్‌లో పిల్లలు నీరు తాగేలా ప్రోత్సహించాలని సూచించింది.

ఆహారం

తాజాగా, వేడిగా ఉండే ఆహారాన్ని పాఠశాలల్లో అందించాలని ఆదేశించింది.

త్వరగా పాడైపోయే ఆహారపదార్థాలను విద్యార్థులు తెచ్చుకోకుండా చూడాలని సూచించింది.

క్లాస్‌ రూమ్‌ల విషయంలో జాగ్రత్తలు

పాఠశాల గదులకు గాలి, వెలుతురు ఉండేలా చూడాలి. ఫ్యాన్లు తప్పని సరిగా ఉండాలి.

కరెంట్ కోత సమస్యలు రాకుండా పవర్ బ్యాకప్ ను ఏర్పాటు చేయాలి.

ఎండ నేరుగా తరగతి గదుల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

యూనిఫాం

వదులుగా, తేలికగా ఉండే నూలు వస్త్రాలు ధరించేలా చూడాలి.

టై తదితర విషయాల్లో మినహాయింపు ఇవ్వాలి.

తోలు బ్యూట్ల బదులు కాన్వర్స్ షూస్ ప్రోత్సహించాలి.

ఫస్ట్ ఎయిడ్ కిట్లు

పాఠశాలల్లో ఓఆర్‌ఎస్ పొట్లాలు అందుబాటులో ఉంచాలి.

విద్యార్థులకు వడదెబ్బ తిగిలితే ప్రాథమిక చికిత్స అందించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి

ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా వాహనాలను అందుబాటులో ఉంచాలి.

అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి.

రెసిడెన్షియల్ పాఠశాలలు వీటితో పాటు కొన్ని అదనపు చర్యలు చేపట్టాలని సూచించింది. నిమ్మకాయ రసం, మజ్జిగ, పండ్లు విద్యార్థుల ఆహారంలో భాగం చేయాలని ఆదేశించింది.

 కారంగా ఉండే పదార్థాలు తగ్గించాలి

హాస్టళ్లు, తరగతి గదుల్లో నీరు, కరెంట్ నిరంతరం ఉండేలా చూడాలి.

Also Read: Sherpa Scaled Everest 26 Times: ఎవరెస్ట్‌పైకి 26వ సారి.. రికార్డు బ్రేక్

Also Read: Uttarakhand Cm in ByPoll: ధామి కోసం ఉత్తరాఖండ్‌కు యోగి ఆదిత్యనాథ్.. రంగంలోకి 40 మంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News