Rape Allegations: రాజస్థాన్ మంత్రి కుమారుడిపై అత్యాచారం ఆరోపణలు సంచలనంగా మారాయి. ఆ మహిళ నుంచి అందుకున్న ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ మంత్రి ఎవరు, అసలేం జరిగింది.
రాజస్థాన్ జైపూర్‌కు చెందిన 23 ఏళ్ల మహిళ రాజస్థాన్ మంత్రి కుమారుడిపై అత్యాచారం ఆరోపణలు చేసింది. రాజస్థాన్ మంత్రి మహేశ్ జోషి కుమారుడు రోహిత్ జోషి..తనపై చాలాసార్లు అత్యాచారం చేశాడని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ గురించి దర్యాప్తు కోసం రాజస్థాన్ పోలీసులకు వివరాలు అందించామని..డిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
మే 8వ తేదీన ఉత్తర జిల్లా పోలీస్ స్టేషన్లో సెక్షన్ 376, సెక్షన్ 328, సెక్షన్ 312, సెక్షన్ 366, సెక్షన్ 377, సెక్షన్ 506 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. మహేశ్ జోషి రాజస్థాన్‌లో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ మంత్రిగా ఉన్నారు.
అసలేం జరిగింది
రాజస్థాన్ మంత్రి కుమారుడు రోహిత్ జోషి..2021 జనవరి 8 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 17 వరకూ పెళ్లి చేసుకుంటానని చెప్పి మభ్యపెట్టి చాలాసార్లు అత్యాచారం చేశాడని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. గత ఏడాది నుంచి ఫేస్బుక్ ద్వారా రోహిత్ జోషితో స్నేహం కుదిరిందని ఆ మహిళ చెప్పింది. జైపూర్‌లో తొలిసారి ఇద్దరూ కలుసుకున్నామని..జనవరి 8, 2021న సవాయ్ మాధోపూర్‌కు తనను రమ్మన్నాడని చెప్పింది.
తొలిసారి కలిసినప్పుడు డ్రింక్‌లో మత్తు కలిపి ఇచ్చాడని..తెల్లారి లేచేటప్పటికి తను అత్యాచారానికి గురై ఉన్నానని చెప్పింది. అదే సమయంలో తనను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి..వాటితో బెదిరించేవాడని ఆ మహిళ పేర్కొంది. రోహిత్ తనను ఓ హోటల్లో భార్యాభర్తలుగా పేర్లు నమోదు చేయించాడని కూడా ఆ మహిళ తెలిపింది. ఆ వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది.
మహిళ చేసిన ఈ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి..తదుపరి దర్యాప్తు కోసం రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందించారు. జీరో ఎఫ్ఐఆర్ అనేది దేశంలో ఎక్కడైనా నమోదు చేయవచ్చు.
Also read: Covid 19 Cases: నిన్నటి కన్నా తగ్గిన కేసులు... దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook