Drugs Rocket busted in Hyderabad: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ దందా బట్టబయలైంది. నగరంలోని దోమలగూడ కేంద్రంగా జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో ఇంటర్నెట్ ఫార్మసీ ముసుగులో నిర్వహిస్తున్న డ్రగ్స్ రాకెట్‌ను ఎన్‌సీబీ అధికారులు బట్టబయలుచేశారు. ఆన్‌లైన్‌లో మందుల విక్రయం పేరుతో.. ఇక్కడి నుంచి అమెరికాకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ డ్రగ్స్ దందాకు కింగ్ పిన్‌గా వ్యవహరిస్తున్న ఆశిష్ అనే వ్యక్తి ఇంటిపై ఎన్‌సీబీ అధికారులు ఆదివారం (మే 8) దాడులు చేశారు. పక్కా సమాచారంతో అతని ఇంటిపై దాడులు చేసిన అధికారులు... రూ.3.71 కోట్ల నగదుతో పాటు ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈమెయిల్స్, వీవోఐపీ ద్వారా కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ తీసుకుంటూ అమెరికాకు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.
గత రెండేళ్లలో దాదాపు వెయ్యికి పైగా ఆర్డర్స్ అమెరికాకు పంపించినట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. క్రెడిట్ కార్డు, బిట్ కాయిన్స్ ద్వారా వీటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు ఆశిష్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రస్తుతం పోలీసులు అతన్ని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
గత నెలలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఉన్న ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ పట్టుబడిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీపై సమాచారంతో పబ్‌పై దాడులు చేసిన పోలీసులు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మెగా డాటర్ నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఓ మాజీ ఎంపీ కుమారుడు సహా పలువురు వీఐపీల పిల్లలు ఉండటంతో ఈ వ్యవహారం సంచలనం రేపింది. ఈ కేసులో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
Also Read: Ys Sharmila On Revanth Reddy: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్.. కాంగ్రెస్ వేస్ట్! వైఎస్ షర్మిల సంచలనం..
Also Read: Video: మదర్స్ డే స్పెషల్... తల్లి అంజనా దేవితో మెగా బ్రదర్స్ ఎమోషనల్ మూమెంట్స్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook