KGF Chapter 2 Collections: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రెండో వారంలోనూ ఈ సినిమా కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదు. హిందీలో షాహిద్ కపూర్ జెర్సీ మూవీ విడుదలైనప్పటికీ... ట్రెండ్‌ను బట్టి చూస్తే సినీ ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ కేజీఎఫ్ 2గానే కనిపిస్తోంది. ఈ నెల 14న విడుదలైన ఈ సినిమా తొలి 8 రోజుల్లో... అంటే గురువారం (ఏప్రిల్ 21) వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లు కొల్లగొట్టింది. ఒక్క హిందీలోనే కేజీఎఫ్ చాప్టర్ 2 రూ.289 కోట్లు వసూలు చేయడం విశేషం.
సాధారణంగా గురువారం బాక్సాఫీస్ కలెక్షన్లు అంతగా ఉండవని అంటుంటారు. కానీ కేజీఎఫ్ 2కి మాత్రం అది వర్తించలేదనే చెప్పాలి. ఈ సినిమా గురువారం (ఏప్రిల్ 21) బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లు కొల్లగొట్టింది. ఇక తొమ్మిదో రోజైన శుక్రవారం (ఏప్రిల్ 23) ఈ సినిమా రూ.23 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఈ వీకెండ్‌తో హిందీలో కేజీఎఫ్ 2 రూ.300 కోట్లు మార్క్ రీచ్ అవడం ఖాయమనే చెప్పాలి. ఇదే విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కేజీఎఫ్ సినిమాతో హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ రేంజ్ ఎక్కడికో వెళ్లింది. ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలైన కేజీఎఫ్ 1 మౌత్ టాక్‌తోనే రికార్డులు సృష్టించింది. దీంతో కేజీఎఫ్ 2 సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోయాయి. ప్రశాంత్ నీల్ టేకింగ్, యశ్, సంజయ్ దత్ పెర్ఫామెన్స్, డైనమట్లా పేలిన డైలాగ్స్, అద్భుతమైన కెమెరా పనితనం, అద్భుతమైన మ్యూజిక్ అన్నీ కలిసి కేజీఎఫ్‌ను బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. ఈ సినిమాతోనే హీరో యశ్ స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగింది. కేజీఎఫ్‌తో ప్రశాంత్ నీల్ ఇండియన్ సినిమాను మరో మెట్టెక్కించారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
#KGF2 continues its Blockbuster run... Remains first choice of moviegoers, despite a new release [#Jersey]... Expect major growth on [second] Sat and Sun... Will join ₹ 300 cr Club on [second] Sat/Sun... [Week 2] Fri 11.56 cr. Total: ₹ 280.19 cr. #India biz. #Hindi pic.twitter.com/wwXxQt7Y8y
— taran adarsh (@taran_adarsh) April 23, 2022
Also Read: WhatsApp Trick: ఈ ట్రిక్‌తో టైపింగ్ అవసరం లేకుండానే ఎవరికైనా టెక్స్ట్ మెసేజ్ పంపొచ్చు...
Also Read: Flipkart Poco M4 Pro: రూ.1,249 ధరకే Poco M4 Pro కొనుగోలు చేయోచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.