Nivetha Pethuraj Photos: తమిళంతో పాటు తెలుగు సినిమాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల లిస్టులో కచ్చితంగా నివేదా పేతురాజ్ ఉంటుంది. తన అందంతో పాటు నటనతో ఎంతోమంది మనసులను దోచేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ బ్లూ డ్రస్సుల్లో నక్షత్రంలా మెరిసిపోతుంది.
నివేదా పేతురాజ్.. 1991 నవంబర్ 30న తమిళనాడులోని మదురైలో జన్మించింది.
2016లో విడుదలైన 'ఒరు నాల్ కూతు' అనే తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. నివేదా పేతురాజ్ నటించిన తొలి తెలుగు చిత్రం 'మెంటల్ మదిలో'.
గత ఏడాది 'రెడ్', 'పాగల్' వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 'విరాట పర్వం', 'బ్లెడీ మ్యారీ' అనే తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది.