Channels block: కేంద్రం మరోసారి నకిలీ వార్తలు ప్రసారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కొరడా ఝులిపించింది. మొత్తం 22 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేస్తూ ఏప్రిల్ 4న ఆదేశాలు జారీ చేసినట్లు.. మంగళవారం ప్రకటించింది. వీటితో పాటు.. మూడు ట్విట్టర్ ఖాతాలు, ఓ ఫేస్బుక్ ఖాతా, ఓ న్యూస్ వెబ్‌సైట్‌పై వేటు వేసింది. ఐటీ రూల్స్ 2021ను అనుసరించి భారత్‌కు సంబంధించిన యూట్యూబ్ ఛానెళ్లు, ఇతర సామాజిక మధ్యమాల ఖాతాలపై వేటు వేయడం ఇదే తొలిసారి.
ఛానెళ్ల వివరాలు ఇలా..
తాజాగా నిషేధం విధించిన 22 యూట్యూబ్ ఛానెళ్లలో 18 ఛానెళ్లు మన దేశానికి చెందినవి కాగా.. 4 ఛానెళ్లు పాకిస్థాన్‌కు చెందినవిగా తెలిపింది కేంద్రం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ అండ్ బీ) పేర్కొంది.
ఈ యూట్యూబ్ ఛానెళ్లన్నింటికి కలిపి.. మొత్తం 260 కోట్ల మేర వ్యూస్ ఉన్నట్లు తెలిపింది ఐ అండ్ బీ.
వేటు ఎందుకు?
వేటు పడిన ఛానెళ్లన్నీ నకిలీ వార్తలను ప్రసారం చేయడం, సామాజిక మధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని షేర్ చేయడం, ముఖ్యంగా జాతీయ భద్రత, విదేశీ వ్యవరహాలు, ప్రజా సంబంధి వ్యవహారాల్లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం వంటివి చేస్తున్నట్లు ఐ అండ్ బీ గుర్తించింది.
తప్పుడు థంబ్ నెయిల్స్, వార్తా ఛానెళ్లను పోలిన లోగోలను వాడి.. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నాయని కూడా వెల్లడించింది ఐ అండ్ బీ పేర్కొంది.
.@MIB_India blocks 22 YouTube channels for spreading disinformation related to India’s national security, foreign relations, and public order
18 Indian YouTube news channels blocked for the first time under IT Rules, 2021. 1/2
Read more: https://t.co/XTdQs6vUb9
— PIB India (@PIB_India) April 5, 2022
కొత్త ఐటీ రూల్స్ అమలులోకి వచ్చిన తర్వాత.. 2021 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 78 యూట్యూబ్ వార్తా ఛానెళ్లను ఇండియాలో బ్యాన్ చేసేందుకు ఆదేశాలిచ్చింది కేంద్రం. వాటితో పాటు పెద్ద సంఖ్యలో సమాజిక మాధ్యమ ఖాతాలను కూడా.. జాతీయ భద్రత, సార్వ భౌమాధికారానికి భంగం కలిగిస్తున్నాయన్న కారణంతో నిషేధించింది.
Also read: Whats App: వాట్సాప్ సంచలన నిర్ణయం.. మెసేజ్ ఫార్వర్డ్ చేయడం ఇక నుంచి కుదరదు..!
Also read: Petrol Price Today: భారీగా పెరిగిన ఇంధన ధరలు.. లీటర్ పెట్రోల్ ధర రూ.120!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook