టీమిండియా బౌలర్ మహ్మద్ షమీకి సంబంధించిన పర్సనల్ ఛాట్ సందేశాలను ఆయన భార్య హసీన్ జహాన్ మరోసారి బహిర్గతం చేశారు. ఆ మెసేజ్లను ఆమె ఫేస్బుక్, ట్విటర్ లాంటి సామాజిక వేదికలపై సర్క్యులేట్ చేశారు. షమీ ఏ అమ్మాయినీ వదలడు అనే అర్థం వచ్చేలా ఆ ఛాట్ సందేశాలకు ఆమె క్యాప్షన్లు కూడా పెట్టారు. అయితే అవే పోస్టులపై షమీ అభిమానులు జహాన్ పై విరుచుకుపడ్డారు.
ఆరోపణలు నిజం అవునో కాదో కోర్టు చూసుకుంటుందని.. ఒక భర్త పరువును బజారుకీడ్చడానికి భార్య సోషల్ మీడియా వేదికలకపైకి ఎక్కి రచ్చ చేయడమేంటని ఆమెపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే షమీపై ఆయన భార్య పోలీసు స్టేషన్లలో అనేక ఫిర్యాదులు దాఖలు చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో పాటు ఆయన అనేకమంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు కూడా పెట్టుకున్నారని తెలిపారు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రాగానే మహ్మద్ షమీని బీసీసీఐ తొలుత కాంట్రాక్టు నుంచి ఉపసంహరిస్తున్నట్లు తెలిపింది. అయితే ఆ ఆరోపణలు నిరాధారమైనవని తేలడంతో.. మళ్లీ కాంట్రాక్టులోకి తీసుకుంది. ఈ రోజు జహాన్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా కలిసి.. తన భర్తపై ఫిర్యాదు చేశారు. తన గోడు విన్న ఆమె సహాయం చేస్తారని తెలిపారు.
అయితే మమత జహాన్ మాటలను ఓపికగా విన్నారని.. కాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూడా చెప్పారని సమాచారం. మార్చి 9, 2018 తేదిన షమీ భార్య జహాన్ కోలకతా పోలీసులను కలసి ఫిర్యాదు చేయగా.. వారు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు. 307, 323, 373, 356 సెక్షన్ల క్రింద కేసులు కూడా నమోదు చేశారు
మహ్మద్ షమీ భార్యపై నెటిజన్లు ఫైర్..!