Ashleigh Barty Retires: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి యాష్లే బార్టీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. 25 ఏళ్ల వయసులోనే తాను టెన్నిస్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ గా ఎదిగే వయసులో తాను ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల టెన్నిస్ అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. తన రిటైర్మెంట్ ప్రకటనను సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా వెల్లడించింది.
ఆస్ట్రేలియాకు చెందిన యాష్లే బార్టీ.. మూడు సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను నెగ్గింది. ఇటీవలే జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విజేతగా నిలిచిన ఆమె.. అంతలోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం ఆమె అభిమానులను షాక్ గురిచేసింది.
అయితే సొంత గడ్డపై 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన ఆసీస్ టెన్నిస్ క్రీడాకారిణిగి యాష్లే బార్టీ రికార్డుకు ఎక్కింది. దాదాపుగా 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ సాధించిన ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారిణిగానూ బార్టీ ఘనత సాధించింది.
Also Read: Virat Kohli Join RCB: ఇన్ని సంవత్సరాలు ఐపీఎల్ ఆడుతానని అనుకోలేదు: కోహ్లీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook