జలశక్తే.. రైతన్నకు శక్తి: భారత ప్రధాని నరేంద్ర మోదీ

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతికి పిలుపునిచ్చారు.

Last Updated : Mar 22, 2018, 04:12 PM IST
జలశక్తే.. రైతన్నకు శక్తి: భారత ప్రధాని నరేంద్ర మోదీ

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతికి పిలుపునిచ్చారు. జలశక్తి గొప్పదనాన్ని ఆయన తెలుపుతూ ప్రజలు నీటిని సంరక్షిస్తేనే.. పల్లెలు, నగరాలు సుభిక్షంగా ఉంటాయని.. రైతన్నలు కూడా సుఖంగా ఉంటారని.. ఎలాంటి సంక్షోభాలు తలెత్తవని ట్విట్టర్ ద్వారా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన జలశక్తి ఔన్నత్యాన్ని తెలిపే వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.2018 సంవత్సరానికి గాను "జలం కోసం ప్రకృతి - 21వ శతాబ్దంలో  ప్రకృతి ఆధారిత విధానాల వల్ల నీటి సమస్యను తొలిగిద్దాం" అనే థీమ్‌తో ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ ఏడాది ఐక్యరాజసమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 2018లో జరుగుతున్న "వరల్డ్ వాటర్ డే" కార్యక్రమంలో ఐక్యరాజసమితితో పాటు యూఎన్ వాటర్, ప్రపంచ కార్మిక సంఘం, ప్రపంచ జల సమితి, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్  సంస్థలు కూడా పాార్టనర్స్‌గా ఉన్నాయి.

Trending News