కేరళలో ఓ లెక్చరర్ అమ్మాయిల శరీర భాగాలను వర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇందుకు నిరసనగా కేరళ రాష్ట్రంలో పచ్చపండు ఉద్యమం జరుగుతుంది. అన్నివర్గాల నుంచి ఈ ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. ఈ పుచ్చపండు ఉద్యమానికి ప్రధాన కారణం ఓ లెక్చరర్. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..!
వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం కొజికోడ్ లోని ఫరూక్ ట్రైనింగ్ కాలేజీలో లెక్చరర్ గా జౌహర్ మునవీర్ పనిచేస్తున్నాడు. ఇటీవల ఒక ప్రైవేట్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. 'నేను ఒక లెక్చరర్ ని. మా కాలేజీలో 80 శాతం మంది అమ్మాయిలే. ఎక్కువ మంది ముస్లింలే. వాళ్లు మత సంప్రదాయానికి తగ్గట్లు దుస్తులు వేసుకోవడం లేదు. చాతీని హిజాబ్ తో కప్పుకోవడం లేదు. పుచ్చకాయలో ఎరుపు భాగాన్ని చూపిస్తునట్లు శరీర భాగాలను చూపిస్తున్నారు' అని జౌహర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కేరళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా, విద్యార్థి సంఘాలు పుచ్చపండు ఉద్యమం చేపట్టారు.
కొన్ని జిల్లాలకు చెందిన అమ్మాయిలైతే ఏకంగా ఫేస్‌బుక్‌లో నగ్న ఫోటోలు పెట్టి నిరసన తెలియజేస్తున్నారు. ఇలాంటి ఫోటోలు పెట్టి నిరసన తెలుపుతున్న వారిలో తిరువనంతపురానికి చెందిన ఆర్తీ అనే 25 ఏళ్ల వివాహిత ఉన్నారు. ఆర్తీ భర్త కూడా ఆమె ఫొటోలను షేర్ చేశాడు. దీనిపై ఆర్తీ మాట్లాడుతూ.. అమ్మాయిల గురించి కొంతమంది చేసిన వ్యాఖ్యలతో కలత చెందానన్నారు. ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన అమ్మాయిల శరీరం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. ఆర్తీ కొచ్చి నుంచి వందల కిలోమీటర్లు ర్యాలీ చేస్తూ పుచ్చపండు ఉద్యమం చేస్తోంది. ఈ ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. కేరళలోని యువతులు పుచ్చకాయలతో తమ నిరసన తెలుపుతున్నారు.
కేరళలో ఓ లెక్చరర్‌కు వ్యతిరేకంగా పుచ్చపండు ఉద్యమం..!