Ponytail Ban: ఆ ప్రాంతంలో పోనీటెయిల్స్ నిషేధం.. అమ్మాయిలు అలాంటి లోదుస్తులే వాడాలి!

Ponytail Ban in Japan: అమ్మాయిలు పోనీటెయిల్ వల్ల అబ్బాయిలు లైంగిక ప్రేరేపణ పొందుతున్నారు అంటే మీరు నమ్ముతారా? ఇదేమి ప్రశ్న అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే.. పోనీటెయిల్ జడ వల్ల అబ్బాయిలు లైంగిక ప్రేరేపణ పొందుతున్నారని.. జపాన్ లోని ఓ ప్రాంతంలో ఆడపిల్లలు పోనీటెయిల్ తో పాఠశాలలకు రావడాన్ని నిషేధించారు. అయితే దాని వెనకున్న కారణం తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2022, 10:35 PM IST
Ponytail Ban: ఆ ప్రాంతంలో పోనీటెయిల్స్ నిషేధం.. అమ్మాయిలు అలాంటి లోదుస్తులే వాడాలి!

Ponytail Ban in Japan: ఓ అమ్మాయి పోనీటైల్ అబ్బాయిలను ఆకర్షిస్తుందని మీకు తెలుసా? దాని వల్లే అనేక అనర్థాలు జరుగుతున్నాయట? ఇదే విషయమై జపాన్ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. పాఠశాలలకు వచ్చే బాలికలు పోనీటైల్ జడ వేసుకోవడం నిషేధం. పోనీటైల్ తో అమ్మాయిలు.. మగాళ్లను రెచ్చగొడుతున్నారనేది అక్కడి వారి వాదన. అందుకే పాఠశాలలకు వచ్చే ఆడపిల్లలు పోనీటెయిల్ జడ వేసుకొని రాకూడదని.. అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

తెల్లరంగు లోదుస్తులు..

'ది న్యూయార్క్ టైమ్స్' నివేదిక ప్రకారం.. జపాన్‌లోని పాఠశాలల్లో పోనీటైల్ నిషేధించడమే కాకుండా.. అనేక విచిత్రమైన నియమాలు ఉన్నాయి. జపాన్ లోని పాఠశాలలకు వెళ్లే పిల్లలు సాక్స్, స్కర్ట్ పొడవుగా ఉండడం సహా లోదుస్తులు తెల్లవి ధరించాలని నియమం ఉంది. అంతేకాకుండా జుట్టుకు నలుపు తప్ప ఎలాంటి రంగు వేసుకోకూడదు. 

పోనీటెయిల్ వల్ల లైంగిక ప్రేరేపణ?

జపాన్‌లోని ఫుకుయోకా ప్రాంతంలోని అనేక పాఠశాలల్లో ఒక సర్వే నిర్వహించబడింది. పోనీటెయిల్ కనిపించే అమ్మాయిల మెడ నుంచి పురుషులు లైంగిక ప్రేరేపణను అనుభవిస్తారని ఈ సర్వేలో తేలింది. ఈ కారణంగా పాఠశాలలకు వెళ్లే ఆడపిల్లలు పోనీటెయిల్ జడ వేసుకొని రావడాన్ని నిషేధించారు. ఈ రూల్ ను అమ్మాయిలు పాటిస్తున్నారు. 

ఈ నియమాలను అక్కడి పాఠశాలల్లో బలవంతంగా అమలు చేశారు. ఈ నియమాలన్నీ 1870 సంవత్సరంలో రూపొందించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నిబంధనలలో ఎలాంటి మార్పు లేదు. జపాన్‌లోని కొన్ని పాఠశాలలు మాత్రమే ఒకటి, రెండు నియమాలను మార్చాయి. అలాంటి నిబంధనలను 'బ్లాక్ రూల్స్' అంటారు.  

Also Read: Lion Vs Buffalo Funny Video: గేదెలకు భయపడి చెట్టు ఎక్కిన మృగరాజు- వీడియో వైరల్!

Also Read: McDonald's Burger: మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ ధర రూ.26,000.. పోటీపడి మరీ కొంటున్న ఫుడీస్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News