Sugarcane Juice Benefits: వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తరచుగా దాహం వేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో పండ్ల రసాలు, కొబ్బరి నీరు, ఎక్కువగా నీరును తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇలా శరీరానికి తగిన నీటి శాతాన్ని అందించడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. కొబ్బరి నీరు, చెరుకు రసం వంటి పానీయాలతో శరీరంలోని వేడిమి తగ్గిపోతుంది.
చెరుకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
చెరకు రసంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ తో పాటు అనేక ఇతర అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.
1. తక్షణ శక్తి
చెరకులో సహజమైన సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. మీరు అధిక వేడితో అలసిపోయినా.. మీ శరీరంలో నీటి కొరత ఉన్నట్లు అనిపించినా.. చెరకు రసం మీకు ఉత్తమ ఎంపిక.
2. కాలేయానికి మేలు చేస్తుంది
ఆయుర్వేదం ప్రకారం.. చెరకు రసం కామెర్లు చికిత్సలో ఉపయోగిస్తారు. ఎందుకంటే చెరుకు రసం కాలేయాన్ని (లివర్ స్ట్రాంగ్) బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చెరకు రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి. కాలేయంలో ఉత్పత్తి అయ్యే బిలిరుబిన్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఇది ఎల్లో ఫీవర్‌ను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది.
3. నోటిలో కావిటీస్, నోటి దుర్వాసన నివారణ
చెరకు రసంలో కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ ఉండటం వల్ల పళ్లపై ఎనామిల్‌ను బలోపేతం చేస్తుంది. తద్వారా వాటికి పురుగులు, దంతాలలో పుచ్చులు ఉండవు. చెరకు రసం కూడా నోటి దుర్వాసన సమస్యను దూరం చేస్తుంది.
4. మూత్రపిండాల్లో రాళ్లను తగ్గిస్తుంది
చెరకు రసం తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రత్యేకంగా మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించేవారు చెరుకు రసం తాగడం వల్ల మేలు జరుగుతుంది. అంతే కాకుండా.. చెరుకు రసం మూత్రపిండాల్లో రాళ్లను తగ్గిస్తుంది.
5. జీర్ణక్రియకు మేలు చేస్తుంది
చెరుకు రసంలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. దీంతో పాటు జీర్ణక్రియను మెరుగు చేయడం సహా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)
Also Read: Lemon Juice Benefits: నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
Also Read: Cycling Benefits: రోజూ సైక్లింగ్ తో బెల్లీ ఫ్యాట్ మాయం.. మరెన్నో ప్రయోజనాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.