Prabhas marriage: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. ఇందులో భాగంగా సినిమా కొత్త ట్రైలర్‌ను బుధవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. ముంబయిలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ప్రభాస్, కథానాయిక పూజా హెగ్డే సహా చిత్ర బృందం పాల్గొంది.
ట్రైలర్ విడుదల అనంతరం ప్రభాస్ సహా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఇందులో చిత్ర విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చారు. ఆయన ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదో అందులో చెప్పారు.
అందుకే పెళ్లి చేసుకోలేదు..
టాలీవుడ్లో కొన్నాళ్లుగా ప్రభాస్ పెళ్లిపై చర్చ సాగుతోంది. ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్' ప్రభాస్ కావడం గమనార్హం. దీనితో ప్రభాస్ తాజా కామెంట్స్ ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుకున్నాయి.
ఇంతకీ ప్రభాస్ ఏం చెప్పారంటే..
రాధే శ్యామ్ ట్రైలర్ విడుదల ఈవెంట్లో ప్రభాస్‌ను ఓ విలేకరి ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. ఈ సినిమా లవ్ స్టోరీగా తెరకెక్కిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా స్టోరీని ఉద్దేశిస్తూ.. ఈ సినిమాలోలా నిజ జీవితంలో ఎప్పుడైనా ప్రేమ విషయంలో అంచనాలు తప్పాయా? అన్న ప్రశ్నకు ప్రభాస్ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది.
నిజ జీవితంలో చాలా సార్లు ప్రేమ విషయంలో అంచనాలు తప్పాయన్నారు ప్రభాస్. తాను ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా అదేనన్నారు. దీనితో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూశాయి.
ప్రభాస్ పెళ్లిపై చర్చ..
బాహుబలి తర్వాత ప్రభాస్ పెళ్లి అంటు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సాహో వచ్చింది.. ఇప్పుడు రాధే శ్యామ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇదే కాకుండా ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆదిపురుష్ (షూటింగ్ పూర్తయింది), సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇన్ని సినిమాల మధ్య బిజీగా ఉన్న ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.
Also read: Isha Koppikar : ఆ హీరో ఒంటరిగా కలవమన్నాడు: నాగార్జున హీరోయిన్
Also read: ButterFly Teaser: నీ కళ్లను, మెదడును అస్సలు నమ్మకు.. ఆకట్టుకుంటున్న అనుపమ 'బటర్ ఫ్లై' టీజర్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Prabhas marriage:'ప్రేమ అంచనాలు తప్పాయి.. అందుకే పెళ్లి చేసుకోలేదు: ప్రభాస్!
పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్
ఇంకా పెళ్లి ఎందుక చుసుకోలేదో వెల్లడి
వైరల్ అవుతున్న ప్రభాస్ కామెంట్స్!