Ashoka Vanamlo Arjuna Kalyanam postponed: యువ హీరో విశ్వక్ సేన్ మొదటి నుంచి వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. వెళ్లిపోమాకే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విశ్వక్ సేన్.. ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆపై హిట్, పాగల్ సినిమాలతో తనలోని నటనను పరిచయం చేశాడు. తాజాగా మరో వెరైటీ సినిమాతో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
విశ్వక్ సేన్, రుక్సర్ థిల్లాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'అశోకవనంలో అర్జున కళ్యాణం'. విద్యా సాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పెళ్లికోసం తంటాలు పడిన విశ్వక్ సేన్ పాత్ర అందరిని బాగా నచ్చింది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాను మార్చి 4న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే తాజాగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వైరటీగా ప్రకటించారు. 'అల్లం అర్జున్ కుమార్ జాతక రీత్యా.. 2022 మార్చి 4వ తేదీన పెళ్లి ముహూర్తం సరికాదని జ్యోతిష్యులు తీర్మానించారు. కావున కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. ఇట్లు.. అల్లం వారి పెళ్లి బృందం' అని హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ ట్వీట్ చేశారు. సినిమా వాయిదాను పెళ్లి కార్డు రూపంలో వైరటీగా ప్రకటించడంతో ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ అయింది.
Madhavi promises you all it will be worth the wait❤️🌸#AshokaVanamLoArjunaKalyanam new release date to be announced soon… pic.twitter.com/Ee4T0Tu8mK
— Rukshar Dhillon (@RuksharDhillon) March 2, 2022
టీజర్, ట్రైలర్‌ను బట్టీ ఏజ్ బార్ అయిన అబ్బాయికి మ్యారేజ్ ఫిక్స్ అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో 'అశోకవనంలో అర్జున కళ్యాణం' మూవీ తెరెకెక్కినట్లు తెలుస్తోంది. ఇంటర్‌క్యాస్ట్ పెళ్లి సెట్ చేసుకున్న అబ్బాయి ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు, పెళ్లి తర్వాత ఆ అమ్మాయితో జర్నీ ఎలా సాగిందనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కింది. పెళ్లి చూపుల్లో ఏజ్ బార్ అబ్బాయికి ఎదురయ్యే సమస్యల్ని కామెడీతో చూపించారు. విశ్వక్ సేన్ మరోసారి ఆకట్టుకున్నాడు. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: Hyderabad Student: తరగతి గదిలోనే గొడవపడ్డ స్టూడెంట్స్.. ఆరో తరగతి విద్యార్థి మృతి!!
Also Read: Shriya Saran Husband: అరుదైన వ్యాధి.. కూతురిని కూడా ఎత్తుకోలేని పరిస్థితిలో స్టార్ హీరోయిన్ భర్త!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook