SBI Recruitment 2022: ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఉద్యోగ నియామకాలకు ప్రకటన చేసింది. వివిధ పోస్టుల్లో భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వెల్లడించింది. ఆసక్తి ఉన్న ఉద్యోగార్థులు అప్లయ్ చేసుకోవచ్చని ప్రకటించింది.
ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. 'స్పెషలిస్ట్ క్యాడెర్ ఆఫీసర్స్' పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్బీఐ. అసక్తు ఉన్నవారు ఎస్బీఐ వెబ్సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.
పోస్టులు, రిజర్వేషన్లు..
1.నెట్వర్క్ సెక్యురిటీ స్పెషలిస్ట్ క్యాటగిరీలో అసిస్టెంట్ పోస్టులు-15
ఇందులో 8 పోస్టులు జనరల్. ఎస్సీ రిజర్వేషన్-2, ఎస్టీ-1, ఓబీసీ-3, ఈడబ్ల్యూఎస్ 1 చొప్పున రిజర్వ్ చేసినట్లు ఎస్బీఐ నోటిఫికేషన్లో పేర్కొంది.
2.రూటింగ్ అండ్ స్విచ్చింగ్ క్యాటగిరీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు గానూ.. 33 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది ఎస్బీఐ.
ఇందులో 15 జనరల్, ఎ్సీ-5, ఎస్టీ-2, ఓబీసీ-8, ఈడబ్ల్యూఎస్-3 చొప్పున రిజర్వ్ చేసింది.
ఏజ్ లిమిట్ ఎంత?
రెండు పోస్టులకు.. గరిష్ఠంగా 40 ఏళ్లు (2021 ఆగస్టు నాటికి) మించకూడదని ఎస్బీఐ తెలిపింది.
ఎలా దరఖాస్తు చేయాలి..
ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారానే అప్లయ్ చేసే వీలుంది. ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తుకు వీలు లేదు. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
- ఈ రెండు పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు పంపేందుకు చివరి తేదీ.. ఫిబ్రవరి 25.
- దరఖాస్తు పంపిన అభ్యర్థులందరికీ మార్చి 20న ఆన్లైన్ టెస్ట్ ఉండొచ్చు.
Also read: Amazon Hitachi AC: సమ్మర్ వచ్చేస్తోంది.. రూ.4,687 ధరకే ఎయిర్ కండిషనర్.. ఈరోజే తుదిగడువు!
Also read: iPhone 12 offer: ఐఫోన్ 12పై అమెజాన్‌లో రూ.25 వేల వరకు తగ్గింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook