/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

క్షణికావేశంతో నిండు ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఆ యువకుడు. అమ్మాయి ప్రేమించలేదని మనస్తాపం చెంది నిండు నూరేళ్ల జీవితాన్ని బలవంతంగా బలితీసుకున్నాడు ఆ దురద్రుష్టవంతుడు. ఇంతకీ ఎవరా దురద్రుష్టవంతుడనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళ్లండి మీరే అర్థమౌతుంది.

స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్  లోని నేరేడ్‌మెట్‌ కు చెందిన సాగర్ అనే ఐఐటీ విద్యార్ధి గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ అమ్మాయి తన ప్రేమను నిరాకరిస్తూవచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాగర్ .. బుధవారం ఆ అమ్మాయితో వాట్సప్ చాట్ చేస్తూ ‘‘నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా... నా చావును నువ్వు చూడాలి.. వెంటనే వీడియో కాల్ చేయ్’’ అని కోరాడు. దీంతో ఆ అమ్మాయి వీడియో కాల్ చేయగా ఆమె చూస్తుండగానే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వాస్తవానికి సాగర్ ది బెదిరింపు మాత్రమేనని భావించిన ఆ అమ్మాయి.. తన స్నేహితురాలితో కలిసి వీడియో చూస్తోంది. అయితే సాగర్ మాత్రం నిజంగానే ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. సాగర్ చనిపోయాడనే విషయాన్ని తెలుసుకున్న అమ్మాయి షాక్ కు గరై ఈ విషయాన్ని వెంటనే వారి తల్లిదండ్రులకు చెప్పింది. ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

చేతికొచ్చిన తమ కుమారుడు ప్రేమ పేరుతో ప్రాణాలు బలితీసుకోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా తాజా ఘటన స్థానికంగా సంచలన రేకెస్తోంది. ప్రేమ పేరుతో ఇలా ప్రాణాలు తీసుకోవడం శోచనీయమంటున్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకుంటూ పోతే.. వారినే సర్వస్వంగా భావించి ఆధారపడ్డ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటినే పశ్న ఉత్పన్నమౌతుంది.. యూత్ ఒక్కసారి ఆలోచించండి.. మీ ప్రేమ జీవిత కాదు.. అది జీవితంలో ఓ భాగం మాత్రమే. 

ప్రేమ సూత్రం :

చెబుతాను విను ప్రేమకో సూత్రం

కాకుడదు అది ఆత్మహత్యాయత్నం

ప్రియురాలిని మెప్పించేది ప్రేమ

పెద్దలను ఒప్పించేది ప్రేమ

ప్రేమ ఒక పావురం వంటిది

గూటి నుంచి బయలుదేరిన పావురం మళ్లీ అదే గూటికి చేరుతుంది

ప్రియరాలు నిను ద్వేషించినా.. నిజమైన ప్రేమకే ఆమె లొంగుతుంది

 ఓర్పు, నేర్పుతో ఉంటేనే ప్రేమను సాధించగలం, జీవితాన్ని జయించగలం

 

Section: 
English Title: 
Love failure committed suicide in video call
News Source: 
Home Title: 

 వీడియోకాల్‌లో యువకుడు ఆత్మహత్య

ప్రేమ ఎంత గుడ్డిదో మరి ; వీడియోకాల్‌లో యువకుడు ఆత్మహత్య
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ప్రేమ ఎంత గుడ్డిదో మరి ; వీడియోకాల్‌లో యువకుడు ఆత్మహత్య