IPL 2022 mega auction: ఐపీఎల్ 2022 మెగా వేలంలో 10 టీమ్స్ మొత్తం 204 ప్లేయర్స్‌ను కొనుగోలు చేశాయి. ఇందుకోసం రూ.551 కోట్లు వెచ్చించాయి. మరి ఆ సారి టాప్ 10లో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్ ఎవరో చూసేద్దామా!
రెండు రోజుల వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ నిలిచాడు. ముంబయి ఇండియన్స్ (ఎంఐ) జట్టు ఇషాన్ కిషన్‌ను రూ.15.25 కోట్లు ఖర్చు చేసి దక్కించుకుంది.
టీమ్ ఇండియా ఆల్ రౌండర్ దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రూ.14 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కాపాడుకుంది.
టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ను ఇసారి కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. అయ్యర్‌ను రూ.12.5 కోట్లు వెచ్చించింది కేకేఆర్.
ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను రికార్డు ధరకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. అతడి కోసం రూ.11.5 కోట్లు ఖర్చు చేసింది. రెండో రోజు వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ లివింగ్ స్టోన్ కావడం గమనార్హం.
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్‌ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఠాకూర్ కోసం రూ.10.75 కోట్లు వెచ్చించింది.
ఆల్ రౌండర్ హర్షల్ పటేల్ ఈ సారి రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. ఆర్సీబీ హర్షల్ పటేల్‌ను రూ.10.75 కోట్లతో కనుగోలు చేసింది.
శ్రీలంక ఆల్ రౌండర్ వానిండు హసరంగాను మళ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. హసరంగ కోసం రూ.10.75 కోట్లు వెచ్చించింది ఆర్సీబీ.
వెస్టిండిస్ వన్డె ఫార్మాట్ కెప్టెన్ నికోలస్ పురాన్‌ను హైదరాబాద్ దక్కించుకుంది. పూరాన్‌ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది ఎస్ఆర్హెచ్.
న్యూజిలాండ్ బౌలర్ లాకి ఫెర్గూసన్‌ను రూ.10 కోట్లకు దక్కించుకుంది కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్. ఇంతకు ముందు ఫెర్గుసన్ కేకేఆర్ తరఫున ఆడాడు.
టీమ్ ఇండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ భారీ ధర పలికాడు. ప్రసిద్ధ్‌ను రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) రూ.10 కోట్లకు దక్కించుకుంది.