India vs West Indies: తొలి వన్డేలో భారత్ ఘన విజయం- 22 ఓవర్లు మిగిలి ఉండగానే..

India vs West Indies: వెస్టిండిస్, ఇండియా వన్డే సిరీస్ తొలి మ్యాచ్​లో భారత్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో 22 ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2022, 10:29 PM IST
  • విండీస్​ వన్డే సిరీస్​లో భారత్ విజయం
  • ఆకట్టుకున్న టీమ్ ఇండియా బౌలర్లు
  • స్వల్ప లక్ష్యం కావడంతో విజృంభించిన బ్యాటర్లు
India vs West Indies: తొలి వన్డేలో భారత్ ఘన విజయం- 22 ఓవర్లు మిగిలి ఉండగానే..

India vs West Indies: అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియా, వెస్టిండిస్​ వన్డే సిరీస్​ తొలి మ్యాచ్​లో.. టీమ్​ ఇండియా ఘన విజయం సాధించింది. 28 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని ఖాతాలో వేసుకుంది భారత్. ఆరు వికెట్ల తేడాతో సునాయాసంగా విజయ ఢంకా మొగించింది. భారత్​కు ఈ మ్యాచ్ 1000వ వన్డే కావడం గమనార్హం.

మ్యాచ్​ సాగిందిలా..

వెస్టిండీస్ టాస్ గెలిచి తొలు బ్యాటింగ్ చేసింది. అయితే భారత బౌలర్ల ధాటికి విండీస్​ బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. 43.5 ఓవర్లు ఆడినప్పటికీ.. 176 పరుగులు మాత్రం చేసి ఆలౌట్ అయ్యారు.

దీనితో స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగిన టీమ్ ఇండియా.. మరో 22 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించగలిగింది. 28 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి తిరుగులేని విజయాన్ని అందుకుంది.

ఎవరెవరు ఎలా ఆడారంటే..

విండీస్ ఆటగాళ్లలో జేసన్ హోల్డర్​ అత్యధికంగా 57 (71) పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో ఫాబిన్​ అలెన్​ 29 (43) ఉన్నాడు. ఇక పురాన్​, డారెన్​ బ్రావో చెరో 18 పరుగులు చేశారు. ఇక మిగతా ఆటగాళ్లు 15 కన్నా తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరారు.

భారత బౌలర్లలో చాహల్​ 4, వాషింగ్టన్​ సుందర్​ 3, ప్రసిద్ధ్​ కృష్ణ 2, సిరాజ్ 1 వికెట్​ చొప్పున తీశారు.

భారత బ్యాటర్ల విషయానికొస్తే..

రోహగిత్ శర్మ 51 బంతుల్లో 60 పరుగులు చేసి అవుటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్​ 36 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. దీపక్ హుడా 32 బంతుల్లో 26 రన్స్ చేసి నౌటౌట్​గా ఉన్నాడు. ఇషాన్​ కిషన్​ 36 బంతుల్లో 28 రన్స్​కు వెనుదిరిగాడు. ఇక కోహ్లీ 4 బాల్స్​ ఆడి 8 పరుగులు చేశాడు. రిషబ్​ పంత్​ 11 (9)కు అవుటయ్యాడు.

విండీస్​ బౌలర్లలో.. అల్జారీ జోసెఫ్​కు 2 వికెట్లు పడగా.. ఫాబిన్ అలెన్ ఓ వికెట్ తీశాడు.

Also read: Suresh Raina father Demise: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తండ్రి కన్నుమూత

Also read: U19 World Cup 2022: అండర్‌-19 వరల్డ్ కప్ విజేతగా భారత్.. కుర్రాళ్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter 

Trending News