India Covid-19 Update: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 1,27,952 కొత్త కేసులు (Corona Cases in India) వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ తో 1,059 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మెుత్తం మరణాల సంఖ్య 5,01,114కి చేరింది. కరోనా నుంచి 2,30,814 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య 4,02,47,902కి చేరింది.
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 13,31,648 కొవిడ్ యాక్టివ్ (Covid-19 Active Cases in India) కేసులున్నాయి. దేశంలో కొత్తగా 47,53,081 మందికి టీకా పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,68,98,17,199 డోసులు పంపిణీ చేశారు.
India reports 1,27,952 fresh #COVID19 cases, 2,30,814 recoveries, and 1059 deaths in the last 24 hours.
Active cases: 13,31,648
Death toll: 5,01,114
Daily positivity rate: 7.98%Total vaccination: 1,68,98,17,199 pic.twitter.com/HAWlsyMnp0
— ANI (@ANI) February 5, 2022
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 29 లక్షల మందికి కరోనా పాజిటివ్ (Corona Cases in World Wide) గా నిర్ధారణ అయింది. వైరస్ తో 11,284 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 39కోట్లు దాటింది. మరణాల సంఖ్య 5,743,109 కు పెరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
India Covid-19 Update: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో తగ్గిన కరోనా కేసులు
వైరస్ తో 1,059 మంది మృతి
దేశంలో 13,31,648 యాక్టివ్ కేసులు