Breaking News: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్.. స్వల్ప లక్షణాలతో క్వారంటైన్

Chiranjeevi Covid Positive: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న తనకు వైరస్ సోకిందని.. స్వల్ప లక్షణాలతో తాను ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నట్లు చిరంజీవి ట్వీట్ చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2022, 10:00 AM IST
    • మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్
    • స్వల్ప లక్షణాలతో క్వారంటైన్ లో ఉన్నట్లు వెల్లడి
    • తనను కలిసిన వారు టెస్ట్ లు చేయించుకోవాలని చిరు వినతి
Breaking News: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్.. స్వల్ప లక్షణాలతో క్వారంటైన్

Chiranjeevi Covid Positive: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కొవిడ్ కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. రోజురోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అటు సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలను కూడా కరోనా పట్టిపీడిస్తోంది. 

ఇటీవలే కొంతమంది రాజకీయ నాయకులతో పాటు స్టార్ నటీనటులు కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఆయన స్వయంగా తెలియజేశారు. 

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తనకు పాజిటివ్ వచ్చిందని.. స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడ్డట్టు తెలియజేశారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. గత రెండు మూడు రోజులుగా తనను కలిసిన ప్రతి ఒక్కరు వెంటనే వెళ్లి టెస్ట్ చేయించుకోవాలని సూచించారు మెగాస్టార్. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని చిరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

Also Read: Neha Sharma Bikini Photos: టూ పీస్ బికినీలో రచ్చ చేస్తున్న రామ్ చరణ్ హీరోయిన్!

Also Read: Ashu Reddy Dubai Visit: అషు రెడ్డి వెనకున్న ఆ బాలీవుడ్ హీరో ఎవరో గుర్తుపట్టారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News