India Corona Cases Today: ఇండియాలో గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలు భారీగా పెరిగాయి. కొవిడ్ ధాటికి ఒక్కరోజే 614 మంది బలయ్యారు. కొత్తగా 2,55,874 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కరోనా మరణాలు ఒక్కసారిగా పెరగడం వల్ల అటు ప్రజలతో పాటు ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి.
మరోవైపు దేశంలో కరోనా నుంచి 2,67,753 మంది కోలుకున్న వారున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,97,99,202 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 4,90,462 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 22,36,842 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 3,70,71,898 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
India reports less than 3 lakh COVID cases- 2,55,874 new cases (50,190 less than yesterday), 614 deaths and 2,67,753 recoveries in the last 24 hours
Active case: 22,36,842
Daily positivity rate: 15.52% pic.twitter.com/IW8LijHuru— ANI (@ANI) January 25, 2022
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. సోమవారం (జనవరి 24) ఒక్కరోజే 27,56,364 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,62,26,07,516 కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 22,89,274 మందికి కరోనా సోకింది. 6,490 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 355,075,829 కి చేరగా.. మరణాలు 56,22,616 కు పెరిగింది.
Also Read: Republic Day 2022: ఈసారి అదిరిపోనున్న బీటింగ్ రిట్రీట్, అలాంటి డ్రోన్ షో అసలు చూసి ఉండరు!
Also Read: Republic Day 2022: రిపబ్లిక్ డే సందర్భంగా నక్సల్స్, ఉగ్రవాదులు దాడులట, అక్కడ హైఅలెర్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.