Horoscope Today: ఏదైనా పని మెుదలుపెట్టాలన్నా... శుభకార్యాలను చేయాలన్నా...ఇలా ప్రతి విషయంలోనూ మంచి చెడుల గురించి ఆలోచిస్తాం. ఈరోజు ఎలా ఉంటుందోనని రాశిఫలాల(Horoscope)పై దృష్టి సారిస్తాం. నేటి (జనవరి 24 వ తేదీ ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (Aries): ఈరోజు ఈ రాశివారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా కాలం గడుపుతారు. ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వృషభం (Taurus) : ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటే మంచి ఫలితాలను సాధిస్తారు. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి.
మిధునం (Gemini): ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారం రంగంలో క్రమంగా ఎదుగుతారు. స్నేహితుల సహాయంతో చేపట్టిన పనిని పూర్తి చేస్తారు.
కర్కాటకం (Cancer): ఈ రాశివారు ఈరోజు శుభవార్త వింటారు. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అనవసర ధన వ్యయం చేస్తారు. తోటివారితో ఆనందం గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Also Read: Palmistry: అరచేతిలో ఆ గుర్తు ఉంటే.. ఎంత పేదోడిగా పుట్టినా అపర కుబేరుడు అవుతాడట..
సింహం (Leo): ఈరోజు ఈ రాశివారు స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్ధికంగా లాభపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు.
కన్య (Virgo) : మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే శుభవార్త వింటారు. బాధకలిగించే కొన్ని సంఘటనలు జరుగుతాయి. కీలక నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల సలహాలను తీసుకుంటారు.
తుల (Libra) : ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర విషయాలతో కాలక్షేపం చేయకండి. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా జరిగేలా చూసుకోవాలి. మానసికంగా సంతోషంగా ఉండేలా చూసుకోండి.
వృశ్చికం (Scorpio) : ఈ రాశివారికి బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సందర్భానుసారంగా ముందుకు సాగితే మేలు.
ధనస్సు (Sagittarius) : ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. కీలక పనులను చేసే ముందు తగిన ఆలోచన చేయాల్సి ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. ధనలాభం పొందుతారు.
మకర (Capricorn): ఈరోజు ఈ రాశివారు అన్ని రంగాల వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. అనవసర వ్యయానికి దూరంగా ఉండడం మంచిది. మనశాంతి ఉండేలా చూసుకోవాలి.
కుంభం (Aquarius) : ఈరాశివారు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సంతోషంగా గడుపుతారు. నచ్చిన ఆహారం తింటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
మీనం (Pisces) : ఈరోజు ఈరాశివారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మానసికంగా ధృడంగా ఉంటే మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook