Rohit Sharma Captaincy: టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ గా తప్పుకుంటున్నట్లు ఇటీవలే విరాట్ కోహ్లీ ప్రకటించిన నేపథ్యంలో తర్వాతి కెప్టెన్ ఎవరన్న అంశం చర్చనీయాంశమైంది. ఆ స్థానంలోకి రోహిత్ శర్మ వస్తాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గాయం కారణంగా సౌతాఫ్రికాతో సిరీస్ కు దూరమైన రోహిత్ శర్మ.. వెస్టిండీస్ తో జరగనున్న సిరీస్ కు అందుబాటులో ఉండనున్నాడని సమాచారం.
వచ్చేనెలలో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు రోహిత్ అందుబాటులో ఉండనున్నాడని తెలుస్తోంది. ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు జరగనున్న మూడు వన్డేలు, టీ20 మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా తలపడతాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నెట్ ప్రాక్టీసులో రోహిత్‌కు తొడ కండరాల గాయమైంది. దీంతో అతను సఫారీ పర్యటనకు దూరమయ్యాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కోలుకున్నాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
"జాతీయ క్రికెట్ అకాడమీలో రోహిత్ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. విండీస్‌తో సిరీస్‌కు అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశముంది. ఫిబ్రవరి 6న అహ్మదాబాద్‌లో జరిగే తొలి వన్డేకు ఇంకా మూడు వారాల సమయం ఉంది" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 6 నుంచి 20 మధ్య వన్డే, టీ సిరీస్‌లు జరగనున్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా జరగనున్న ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. ఫిబ్రవరి 6న తొలి వన్డే, 9న రెండో వన్డే, 12న మూడో వన్డే జరగనుండగా.. ఫిబ్రవరి 15న తొలి టీ20, 18న రెండోది, 20న మూడో టీ20 జరగనున్నాయి.
Also Read: Beijing Winter Olympics: విశ్వక్రీడలపై కరోనా పంజా.. ప్రేక్షకులు లేకుండానే బీజింగ్ వింటర్ ఒలింపిక్స్
Also Read: Virat Kohli career: విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఎన్నో అవరోధాలు.. మరెన్నో రివార్డులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Rohit Sharma Captaincy: కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ- వెండీస్ సిరీస్ కు సిద్ధమైన రోహిత్ శర్మ