Covid 19 cases in India: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా 2,68,833 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 4631 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కరోనాతో మరో 402 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 14,17,820 కరోనా యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,22,684 మంది కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 16.66శాతంగా ఉంది. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6041కి చేరింది.
India reports 2,68,833 fresh COVID cases (4,631 more than yesterday) and 1,22,684 recoveries in the last 24 hours
Active case: 14,17,820
Daily positivity rate: 16.66%Confirmed cases of Omicron: 6,041 pic.twitter.com/V8Qlx83eis
— ANI (@ANI) January 15, 2022
జమ్మూకశ్మీర్‌లో వీకెండ్ కర్ఫ్యూ:
కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు అమల్లో ఉన్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్‌లోనూ వీకెండ్ కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను మూసివేశారు. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో అనుమతించనున్నారు.
ఫిబ్రవరిలో కోవిడ్ పీక్స్‌కి చేరే సూచనలు :
దేశంలో రోజువారీ కేసుల సంఖ్య (Covid 19 cases in India) ఇలాగే కొనసాగితే వచ్చే ఫిబ్రవరి నాటికి కరోనా పీక్స్‌కి చేరే సూచనలు ఉన్నాయని ఇప్పటికే పలువురు నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. కొత్త కేసుల్లో ఒమిక్రాన్ కేసుల నిర్ధారణకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నారు. గతేడాది కరోనా సెకండ్ వేవ్ డెల్టా వేరియంట్ కారణంగా సంభవించగా.. ఈసారి ఒమిక్రాన్‌తో థర్డ్ వేవ్ రావొచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువ అయినప్పటికీ... అది కూడా ప్రమాదకర వేరియంటేనన్న విషయం గుర్తుంచుకోవాలని ఇటీవల డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.
Also Read: UP Polls: యూపీలో కొత్త రాజకీయ సమీకరణాలు, చంద్రశేఖర్ ఆజాద్‌తో చేతులు కలపనున్న అఖిలేశ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook