Man survives after lightning strike hits : భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి... అందుకే బతికి బయటపడ్డాడు... ఎవరైనా తృటిలో ప్రమాదం నుంచి బయటపడినప్పుడు ఈ సామెతను వాడటం ఎక్కువగా వింటుంటాం. తాజాగా ఇండోనేషియా రాజధాని జకర్తాలో జరిగిన షాకింగ్ ఘటనను చూస్తే... ఆ సామెత నిజమనిపించకమానదు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇండోనేషియా మీడియా కథనం ప్రకారం... జకర్తాలో భారీ యంత్రాల తయారీకి సంబంధించిన కంపెనీలో పనిచేసే ఓ 35 ఏళ్ల సెక్యూరిటీ గార్డు ఇటీవల పిడుగుపాటుకు గురయ్యాడు. ఇటీవల ఓరోజు వర్షం కురిసిన సమయంలో కంపెనీ ఆవరణలోనే అతనిపై పిడుగు పడింది. చేతిలో గొడుగు పట్టుకుని నడుస్తుండగా ఒక్కసారిగా అతనిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే ఇతర సిబ్బంది అతని వద్దకు పరిగెత్తుకెళ్లారు.
అదృష్టవశాత్తు ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం గమనార్హం. చేతులపై మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. సిబ్బంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. ప్రస్తుతం ఇంటి వద్దే కోలుకుంటున్నాడు. సాధారణంగా పిడుగుపాటుకు గురైతే మనిషి బతకడం కష్టం. కానీ ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం మిరాకిల్ అని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Videos) మారింది. ఆ వ్యక్తి చేతిలో ఉన్న వాకీ టాకీ పిడుగును ఆకర్షించి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Security officer in Jakarta was struck by lightning while on duty, avoid using radio and cellular telephones when it is raining, the condition of the victim survived after 4 days of treatment. not everyone has the same chance to live. 当選確率 #Bitcoin #NFTs $BTC $ETH #ALERT pic.twitter.com/4XhW6Oh3U9
— Lexus RZ (@Heritzal) December 26, 2021
Also Read: Disha Patani: అడుక్కుతినేవాళ్లు కూడా అలాంటి డ్రెస్ వేసుకోరు-దిశా పటానీపై ట్రోలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook