దక్షిణాఫ్రికా టూర్ తరువాత భారత జట్టు నిదహాస్ టోర్నీ ఆడేందుకు శ్రీలంకకు వెళ్లింది. మనోళ్లే ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నారు. నేడు తొలి పోరులో శ్రీలంకతో తలపడనున్నారు. ఇప్పటివరకు సఫారీలతో తలపడిన భారత జట్టు ఇప్పుడు ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్ లతో పోరాడనుంది.
1998లో నిదాస్ ట్రోఫీ మనదే..!
1998లో జరిగిన నిదాస్ ట్రోఫీకి న్యూజిలాండ్, శ్రీలంకలు పోటీపడిన ఆ టోర్నీ ఫైనల్లో ఆతిథ్య లంకజట్టుపై భారత్ విజయం సాధించింది. గంగూలీ, సచిన్‌లు తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 252 పరుగులు జోడించగా.. నిదహాస్ ట్రోఫీ టీమ్ ఇండియా సొంతమైంది. మళ్లీ 2018లో నిదహాస్ ట్రోఫీ. ఈసారి ప్రత్యర్థులు ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్. అప్పుడు దిగ్గజాలతో శ్రీలంకకు వెళ్లగా.. ఇప్పుడు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చారు.
శ్రీలంకకు వెళ్లిన జట్టులో విరాట్ కోహ్లి, మిస్టర్ కూల్ ఎం.ఎస్ ధోని, పాండ్యా, భుమి, బుమ్రాలు లేరు. అటు శ్రీలంక జట్టులో కూడా మాథ్యూస్ సహా గుణరత్నె, మధుశంక లేరు. రెండు వైపులా కీలక ఆటగాళ్లు కొందరు లేకపోయినా.. ముక్కోణపు టీ20 తొలి పోరు ఆసక్తికరంగా మారింది. సాయంత్రం 7 గంటలకు డీ స్పోర్ట్స్‌లో మ్యాచ్ ప్రసారం అవుతుంది.
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), సురేశ్ రైనా, కెఎల్ రాహుల్, మనీశ్ పాండే, రిషబ్ పంత్/దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, యుజ్వెంద్ర చాహల్, షార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జైదేవ్ ఉనద్కత్.
శ్రీలంక : కుశాల్ మెండిస్, ధనుష్క గుణతిలక, కుశాల్ పెరీరా, ఉపుల్ తరంగ, దసున్ శనక, తిశార పెరీరా, దినేశ్ చండిమాల్ (కెప్టెన్), అఖిల ధనంజయ, అమిలా, సురంగ లక్మల్, దుష్మంత చమీరా