జమ్మూ కాశ్మీర్‌లోని సుంజ్వాన్ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో ఆర్మి క్యాంపుపై ఆకస్మిక దాడికి పాల్పడిన ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడికి ప్లాన్ రచించిన కీలక టెర్రరిస్టు ముఫ్తీ వాకస్‌ను ఆఖరికి ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని అవంతిపూర్ ప్రాంతంలో భారతదేశానికి చెందిన స్పెషల్ ఇంటెలిజెన్స్ టీమ్ అధికారులు సర్జికల్ ఆపరేషన్ నిర్వహించారు.
ఆ ఆపరేషనులో భాగంగా అదే ప్రాంతంలో మాటు వేసిన టెర్రరిస్టు వాకస్‌ను పోలీసులు హతమార్చారు. ఈ విషయాన్ని కాశ్మీర్ ప్రాంత ఐజీ ఎస్ పీ పాణి తెలిపారు. సుంజ్వాన్ దాడిలో టెర్రరిస్టులను ఎదుర్కోవడంతో పాటు, వారిని మట్టుబెట్టడం, అలాగే తమ సైన్యాన్ని రక్షించుకోవడానికి భారత సైనికులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది.
Waqas, operation commander of JeM, eliminated in Awantipora. He was mastermind behind several terrorist attacks on security forces including Sunjuwan attack. Weapons & incriminating materials like IED preparation material recovered. He is a foreign terrorist: SP Pani, IG Kashmir pic.twitter.com/obVOuXHMGE
— ANI (@ANI) March 5, 2018