Vastu Tips For Home: ఇంటి వాస్తు అనేది.. అందులో నివసించే వారి జీవితాలపై ప్రభావం చూపుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఏ దిశకు దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వివిధ దిశలలో ఉంచబడిన అనేక వస్తువులు ఒక వ్యక్తి జీవితంలో సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అయితే, ఇలాంటి వాటిపై సమాచారం లేకపోవడం వల్ల ప్రజలు అలాంటి సమస్యలను పట్టించుకోరు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం దిశగా కుబేరుని స్థానం. అందుకే ఉత్తరం ఎప్పుడూ దోషాలు లేనిదని కొందరు అంటుంటారు. ఈ నేపథ్యంలో ఇంట్లోని ఉత్తర దిశగా బరువైన వస్తువులు పెట్టరాదని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. ఉత్తర దిశగా సంపద ఎక్కువ ఉన్నట్లయితే ఇంట్లోని సంపద తరిగిపోతుందని తెలుస్తోంది.
ఉత్తర దిశలో గృహ ప్రవేశం
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి ప్రవేశ ద్వారం ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ఉండాలి. మీరు ఈ దిశలో అద్దం ఉంచితే అది మంచిదని చెప్పబడింది. అంతేకాకుండా ఈ దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి. ఉపాధిలో పురోగతి సాధించాలంటే, సంపదకు అధిపతి అయిన కుబేరుని విగ్రహాన్ని ఉత్తరం వైపున ఉంచాలి.
ఉత్తర దిశగా వంటగది
వాస్తు రీత్యా ఉత్తరం వైపు వంటగది చాలా శుభప్రదం. వంటశాల ఉత్తరదిశలో ఉన్నందున అన్నపూర్ణ తల్లి ఎప్పుడూ అక్కడే ఉంటుందని చెబుతారు. ఇంటికి ఉత్తరం వైపు ఎప్పుడూ నీలం రంగు వేయాలి. ఇలా చేస్తే లాభం అంటారు.
గోడలకు పగుళ్లు ఉండరాదు..
వాస్తు ప్రకారం ఉత్తరం వైపు గోడలపై పగుళ్లు ఉండకూడదు. గోడలకు పగుళ్లు ఏర్పడితే పురోగతి మందగించవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.
Also Read: Vastu tips: ఆఫీస్ టేబుల్‌ను ఇలా సెట్ చేసుకుంటే ఇక విజయం మీ సొంతం...
Also Read: December 19 Horoscope: ఈ రాశివారు ఆదివారం స్నేహితులకు దూరంగా ఉండండి.. దొరికితే అంతే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి