Gautam Gambhir: టీమ్ ఇండియా మాజీ ఆటగాడు.. గౌతమ్ గంభీర్ ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్ 2022లో గౌతమ్ గంభీర్ ఓ టీమ్‌కు (Gautam Gambhir back to IPL) మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
ఐపీఎల్లో కొత్తగా ఏర్పాటైన లఖ్‌నవూ ఫ్రాంఛైజీ.. గౌతమ్ గంభీర్‌ను మెంటార్‌గా (Gautam Gambhir appointed Lucknow mentor ) నియమించుకుంది. జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ఫ్లవర్ టీమ్ హెడ్ కోచ్‌గా ఎంపిక చేసిన మరునాడే.. గంభీర్‌ను మెంటార్‌గా నియమించుకుంటున్నట్లు ప్రకటన వెలువడటం గమనార్హం. ఆండీ చివరి రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పని చేసి.. ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశాడు.
ఐపీఎల్లో గంభీర్‌కు ప్రత్యేక గుర్తింపు..
ఐపీఎల్లో గౌతమ్ గంభీర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) సారథిగా 2012, 2014లో రెండు సార్లు టైటిల్ గెలిపించిన ఘనత గంభీర్ సొంతం.
2017 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన గంభీర్.. 2018లో ఢిల్లీ డేర్ డెవిల్స్ సారథిగా బాధ్యతలు స్వీకరించాడు. అయితే కెప్టెన్సీ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. ఇక అదే సంవత్సరం అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు.
రిటైర్మెంట్ తర్వాత బీజేపీలో చేరిన గౌతమ్ గంభీర్.. ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా గెలుపొందటం గమనార్హం.
Also read: Glenn Maxwell: భారత అల్లుడు కాబోతున్న మాక్స్‌వెల్-పెళ్లిపై గర్ల్‌ఫ్రెండ్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
Also read: Rohit Sharma : సౌత్ ఆఫ్రికా వెళ్లని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియాలో ఏం చేస్తున్నాడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook